హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతున్న చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సెటైర్ల వర్షం కురిపించారు. టీడీపీకి అనుకూలంగా సర్వేలు ప్రకటించిన లగడపాటి రాజ గోపాల్ సహా.. టీడీపీ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లతో విరుచుకుపడ్డాడు.
ఇప్పటికే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏపీలో విడుదల కాకుండా చూడటంతో టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేసిన ఆయన.. ఇప్పుడు తన కసి తీర్చుకున్నారు.
కేఏ పాల్‌కి 59 ఓట్లు..
అటు ఏపీ ఎన్నికల్లో మాదే అధికారం అని అనేక సార్లు మీడియా ముందు డప్పు కొట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్…తాను పోటీ చేసిన నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ లీడింగ్ లో ఉంది. ఇక కేఏ పాల్‌కి 59 ఓట్లు వచ్చాయి. ఇక ఇక్కడ రెండో స్థానంలో టీడీపీ ఉండగా, మూడో స్థానంలో జనసేన ఉంది.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకి గాను వైసీపీ 151 స్థానాల్లో లీడింగ్ ఉంది. టీడీపీ 23 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
Name: TDP
Born : 29th March 1982
Died : 23rd May 2019
Causes of death : Lies , Back Stabbings , Corruption , Incompetence , Y S Jagan and Nara Lokesh
— Ram Gopal Varma (@RGVzoomin) May 23, 2019
The sins caught up pic.twitter.com/KtzBJv0cLS
— Ram Gopal Varma (@RGVzoomin) May 23, 2019
— Ram Gopal Varma (@RGVzoomin) May 23, 2019








