అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ దెబ్బకి సైకిల్ రెండు ముక్కలు అయిపోయింది. చంద్రబాబు పరిపాలన మీద విసుగెత్తిపోయిన ప్రజలు జగన్‌కి జై కొట్టారు. గురువారంం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతుంది.
మొత్తం 175 స్థానాల్లో వైసీపీ 150 స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ 23, జనసేన 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక ఈ ట్రెండ్స్ బట్టి చూస్తే జగన్ సీఎం అవ్వడం ఖాయమైంది. దీంతో ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
చదవండి: బిగ్ బ్రేకింగ్: కుప్పంలో చంద్రబాబు వెనుకంజ…
ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన నేపథ్యంలో జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో ఫోన్ లో మాట్లాడారు.ఆయన సూచన మేరకు ఈ నెల 30న ప్రమాణస్వీకారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అలాగే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎల్లుండి(మే 25న) వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కేంద్రంలో ఎన్డీయే 330 స్థానాల్లో దూసుకుపోతుండగా, యూపీఏ 102, ఇతరులు 109 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ 8, బీజేపీ 4, కాంగ్రెస్ 4, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.








