- Advertisement -
కరీంనగర్: తెలంగాణలో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆ పదవి నుండి దించాల్సిన సమయం వచ్చిందని నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమి తెలంగాణలో అధికారంలోకి రాబోతోందని ఆమె జోస్యం చెప్పారు.
కరీంనగర్‌లో శనివారం నిర్వహించిన మహిళా సదస్సులో విజయశాంతి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 10 మంది మహిళ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని తెలిపారు.
మహిళల ఆత్మగౌరవాన్ని కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని చెప్పారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటివరకూ ఒక్క మహిళా మంత్రి కూడా లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని విజయశాంతి ఈ సందర్బంగా గుర్తు చేశారు.
- Advertisement -