హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బుధవారం నామినేషన్ వేయనున్నారు. తన ఇష్టదైవం కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి అనంతరం బుధవారం మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో కె. చంద్రశేఖర రావు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు.
బుధవారం ఉదయం 9 గంటలకు కేసీఆర్ నంగునూరు మండలంలోని కోనాయిపల్లికి చేరుకుని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహం ముందు నామినేషన్ పత్రాలను ఉంచి పత్యేక పూజలు చేసిన తర్వాత ఆలయంలోనే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తారు.
ఈ సందర్భంగా కె. చంద్రశేఖర రావు ఆలయం బయట గ్రామస్తులనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం గజ్వేల్‌లోని ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 2.34 గంటల సమయంలో కె. చంద్రశేఖర రావు నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు.
కోనాయిపల్లి కేసీఆర్ సెంటిమెంట్…
కె. చంద్రశేఖర రావు 1985 నుంచి తను పోటీ చేసిన ప్రతి ఎన్నికల సందర్భంగా కోనాయిపల్లి వెంకన్నఆలయంలో పూజలు చేశాకే నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాకనే ఆయన టీఆర్ఎస్ ఆవిర్భవాన్ని ప్రకటించారు.
అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్‌ను కె. చంద్రశేఖర రావు కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ కోనాయిపల్లికి రానున్నందున అక్కడ హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. కోనాయిపల్లి వెంకన్న ఆలయంలో కె. చంద్రశేఖర రావు నిర్వహించనున్న పూజల్లో పాల్గొననున్న మంత్రి హరీశ్‌రావు కూడా బుధవారం మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటలలోపు నామినేషన్ వేయనున్నారు.