25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ చేయకపోవడంపై చంద్రబాబు సీరియస్…

ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ చేయకపోవడంపై చంద్రబాబు సీరియస్…

- Advertisement -

హైదరాబాద్: ప్రతియేటా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ని పూలతో అలంకరణ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి అలాంటి కార్యక్రమం ఏమి కనపడలేదు.

నిన్న ఉదయం ఎన్టీఆర్ ఘాట్‌ని సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఘాట్‌లో అలంకరణ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక వారే స్వయంగా పూలని తెప్పించి అలంకరణ చేశారు. ఇక నుంచి ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ బాధ్యతని తానే తీసుకుంటానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేశారు.

ఇక ఎన్టీఆర్‌ ఘాట్‌ ను పూలతో అలంకరించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. గత సంవత్సరం ఎన్టీఆర్ ఘాట్ అలంకరణ ఏర్పాట్లని తెలంగాణ ప్రభుత్వమే చూసుకుందని చంద్రబాబు చెప్పారు.

అలాగే ఈ సంవత్సరం కూడా తాము లేఖను ఇచ్చామని, ప్రభుత్వమే అలంకరణ చేస్తుందని భావించామని అన్నారు. అయితే ఘాట్‌ వద్ద అలంకరణ చేయలేదనే వార్తలు తాను మీడియాలోనే చూశానని చెప్పారు.

మరోసారి ఇలా జరగకుండా చూసుకోవాలని… ఒకవేళ తెలంగాణ  ప్రభుత్వం చేయకపోతే పార్టీ ద్వారా, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా అలంకరణ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో సమాచార లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.

చదవండి: ఆయన కుమార్తెగా పుట్టడం నా అదృష్టం: పురందేశ్వరి

- Advertisement -