25.2 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు తెలంగాణ అయ్యో పాల్ ఎంత పని చేశావ్: కేఏ పాల్‌పై చీటింగ్ కేసు పెట్టిన మహిళ

అయ్యో పాల్ ఎంత పని చేశావ్: కేఏ పాల్‌పై చీటింగ్ కేసు పెట్టిన మహిళ

- Advertisement -

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ చిక్కుల్లో పడ్డారు. హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళ పాల్‌పై చీటింగ్ కేసు పెట్టింది.

అమెరికా పంపిస్తానని డబ్బులు తీసుకొని తనను మోసం చేశాడంటూ ఓ మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే… అమెరికా వెళ్లేందుకు సాయం చేయాల్సిందిగా హైదరాబాద్ బి‌హెచ్‌ఈ‌ఎల్ చెందిన సత్యవతి అనే మహిళ కేఏ పాల్‌ని ఆశ్రయించారు. అయితే అమెరికా వెళ్లేందుకు విజిట్ వీసా, స్పాన్సర్‌షిప్‌ లెటర్ అందిస్తానని కేఏ పాల్… ఆయన అనుచరులు రూ.15 లక్షలు ఆమె వద్ద నుంచి డిమాండ్ చేశారు.

దీంతో ఆమె మొత్తం ఎమౌంట్‌ని వారికి పంపింది. అయితే డబ్బులు తీసుకున్న తర్వాత స్పాన్సర్‌షిప్ లెటర్‌ని ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని సత్యవతి ఆరోపించారు.

ఇక ఈ విషయమై పాల్ అనుచరులను అనేకసార్లు అడిగినా.. వారి దగ్గర నుంచి సరైన స్పందన రాకపోవడంతో… పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేఏ పాల్‌తో పాటు విజయ్, జ్యోతిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: తండ్రీ.. నన్నేల విడిచితివి?

 

- Advertisement -