
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌పై వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ…. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడానికి చంద్రబాబుతోపాటూ ఆయన కొడుకు నారా లోకేషే కారణమన్నారు .
లోకేష్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచీ పార్టీ పతనం మరింత ఎక్కువైందని అన్నారు. అలాగే తన శాపం తగిలి చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. ఇక చంద్రబాబు వయసు అయిపోయిందనీ, మరో పదేళ్ల తర్వాత తిరిగి టీడీపీని అధికారంలోకి తెచ్చేంత సీన్ చంద్రబాబుకి లేదని ఆమె అన్నారు. ఇంకో పదేళ్ళు వైసీపీనే అధికారంలో ఉంటుందని చెప్పారు.
ఎన్టీఆర్‌కి టీడీపీ పగ్గాలు
చంద్రబాబు లేని టీడీపీని తాను చూడాలనుకుంటున్నని, చంద్రబాబు లేని టీడీపీ గెలిస్తే తనకు ఆనందమే అన్నారు. ఇందుకోసం జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తారని చాలా మంది అంటున్నారనీ చెప్పారు.
అయితే ఎన్టీఆర్‌కి పార్టీ నడిపే అంత సమర్థత ఉందా అనేది ముందు తేలాలన్నారు. ఇక దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకూ ఏమీ మాట్లాడలేదనీ, మాట్లాడితే ఆయన సమర్థుడో కాదో తెలుస్తుందని అన్నారు. చంద్రబాబు లేని టీడీపీ గెలవాలనుకుంటున్న ఆమె… జూనియర్ ఎన్టీఆర్‌కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే పర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.








