2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటా…!

- Advertisement -

హైదరాబాద్: ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ ఉండటంతో…చాలా రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసేసింది.

అలాగే తెలంగాణలో కూడా బీజేపీ ఎవరు ఊహించని విధంగా నాలుగు ఎంపీ సీట్లని గెలుచుకుంది. ఈ క్రమంలో నిన్న నిజామాబాద్ లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ…ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మరో నాలుగేళ్లలో తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు. ఇక్కడ మధ్యంతర ఎన్నికలు జరిగిన పక్షంలో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తుందన్నారు.

తెలంగాణాలో బీజేపీ బలం పుంజుకున్నదని చెప్పిన రామ్ మాధవ్.. పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై  పోరాటం  చేస్తున్న మాదిరిగా ఇక్కడ బీజేపీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడాలని చెప్పారు.

ఇక కేసీఆర్, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పాలనుకున్నారని, కానీ వారి ఆశలు ఫలించలేదన్నారు. తెలంగాణా బీజేపీ శాఖ తోడ్పాటు వల్లే కమలం పార్టీ జాతీయ స్థాయిలో 300 కు పైగా సీట్లు గెలుచుకోగలిగిందని రామ్ మాధవ్ పేర్కొన్నారు.

చదవండి: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్!
- Advertisement -