26.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు…విదేశీ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు…

12 నుంచి అసెంబ్లీ సమావేశాలు…విదేశీ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు…

Chandrababu Naidu News, AP Assembly News, AP Political News, Newsxpressonline
- Advertisement -

అమరావతి: ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన విదేశీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు తన కుటుంబసభ్యులతో విదేశాలకు వెళ్లాలని చంద్రబాబునాయుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు.

కానీ ఈనెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని తెలియడంతో… తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇక జూన్ 8న ఏపీ కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరగనుండగా…10న కేబినెట్ సమావేశం జరుగుతుంది.

ఇక 12న కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు అందరు కూడా అసెంబ్లీ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పల నాయుడు వ్యవహరిస్తారు. ఆయనే ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయిస్తారు.

ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది. వైసీపీ నుంచి 151 మంది, టీడీపీ నుంచి 23 మంది, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే విజయం సాధించిన విషయం తెల్సిందే.

చదవండి: ప్రజావేదిక కోసం టీడీపీ-వైసీపీ పోటీ…ఎవరికి దక్కుతుందో..?
- Advertisement -