
అమరావతి: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి పాలనలో బిజీగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి….మరో రెండు రోజుల్లో కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నారు. జూన్ 8న మంత్రివర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. అలాగే కేబినెట్‌తో 10న సమావేశం జరగనుండగా….12న ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి.
ఈ సమావేశాలు ఐదు రోజులపాటు జరుగుతాయని తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేల చేత…బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు ప్రోటెం స్పీకర్‌గా ఉండి…ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ని ఎన్నుకొనున్నారు.
అయితే అసెంబ్లీ స్పీకర్ రేసులో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, నగరి ఎమ్మెల్యే రోజా, ఆనం రాంనారాయణ రెడ్డి ఈ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం.
అలాగే గత స్పీకర్ కోడెల శివ ప్రసాద్‌ని ఓడించిన సత్తెన పల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేరు కూడా బాగానే వినిపిస్తుంది. విపక్షాలకు తనదైన శైలిలో సమాధానం చెప్పే నేర్పరి అయిన అంబటి ఈ స్పీకర్ పదవి సరిగ్గా సరిపోతుందని, అందుకనే ఈయన పేరు పరిశీలనలో తీసుకున్నారని సమాచారం. మరి అధికారికంగా ఎవరు పేరు ప్రకటిస్తారో చూడాలి.








