
అమరావతి: ఏపీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారీ మెజారిటీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైసీపీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతానని జగన్ సంకేతాలు పంపించాడు.
సీఎంగా వారం తిరగకమునుపే పదుల సంఖ్యల్లో అధికారులతో భేటీలు నిర్వహించి, రాష్ట్రంలోని వివిధశాఖల వారీగా సమీక్షలు జరిపి రాష్ట్ర పరిస్థితులపై ఇప్పుడిప్పుడే ఒక అవగాహనకి వస్తున్నాడు.
అలాగే మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని నిరవేర్చడానికి కూడా కమిటీలని సిద్ధం చేస్తూ ప్రజల మనసు గెలుచుకుంటూ ముందుకుపోతున్నాడు. బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల నుంచి ఏడాది లోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
చదవండి: పోలీసుల వీక్లీ ఆఫ్ పై జగన్ సంచలన నిర్ణయం!
ఇకపోతే వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు , ప్రస్తుతం అధికారంలోకి వచ్చినా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ సమయంలోనే వైసీపీ ప్రభుత్వం రావడంతో గతంలో జరిగిన అవినీతిపై సమీక్షలు నిర్వహించి , తప్పు చేసిన వారి తోలు తీస్తామని జగన్ చెప్తున్నాడు.
ముఖ్యంగా రాజధాని భూ ఆక్రమణలు, రాజధాని బాండ్ల విక్రయాలు, అలాగే రాష్ట్రంలో జరిగిన టెండర్ల పాలసీలపై జగన్ ఉక్కుపాదం మోపడానికి సిద్ధం అవుతున్నాడు.
ఈ నేపథ్యంలో గతంలో తమ శాఖలో జరిగిన అవినీతిని తమ దృష్ఠికి తీసుకొస్తే వెంటనే ప్రొమోషన్ ఇచ్చి అధికారులను సన్మానిస్తానని జగన్ తన రివ్యూ మీటింగ్‌లో అధికారులతో చెబుతున్నట్లు సమాచారం. అలాగే మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిలోనూ తన తండ్రి వైఎస్సార్ మార్క్ కనిపించేలా వ్యవహరిస్తోన్నారని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటానని ప్రకటించిన జగన్ తన వ్యక్తిగత ఖర్చులు వేరుగా, ప్రభుత్వ ఖర్చులు వేరుగా చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక విమానాలు వాడుకోవడానికి వీలున్నా, అందుకు సీఎం జగన్ విముఖత చూపిస్తోన్నట్లు సమాచారం.








