

హైదరాబాద్: ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్‌బజార్ అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్‌కు సిద్ధమైంది. ‘సబ్ సే సస్తే 5 దిన్’ పేరుతో ఈ నెల 23న ప్రారంభమవనున్న ఈ షాపింగ్ పండుగ 27న ముగియనున్నదని తెలిపింది.
ఈ ఆఫర్లలో భాగంగా రూ.3 వేలకు పైబడి ఆహార, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, దుస్తులు, పాదరక్షలు, బొమ్మలు, లగేజ్‌లతోపాటు ఇతర వస్తువుల కొనుగోలు చేసిన వారికి 20 శాతం కంటే అధికంగా క్యాష్‌బ్యాక్ లభించనుంది.
చదవండి: వావ్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ.. డిస్కౌంట్ ఆఫర్లతో వినియోగదారులకు పండగే!
దీంతోపాటు రూపే కార్డు కలిగిన కొనుగోలుదారులకు అదనపు రాయితీ ఇస్తారు. అయితే కొనుగోలుదారులు కనీసం రూ.500 విలువైన షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నెల 21 నుంచి 22 లోపు రూ.1,000 షాపింగ్ చేసిన ప్రత్యేక సభ్యులకు రూ.100 అదనపు డిస్కౌంట్‌ను కూడా కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు.
దుస్తులపై 50 శాతం రాయితీతోపాటు అదనంగా 20 శాతం క్యాష్‌బ్యాక్, రూ.22,990 ధర కలిగిన కోర్యో 32 అంగుళాల సూపర్ స్లిప్ ఎల్‌ఈడీ టీవీ, 2 హెచ్‌డీఎంఐ, 2 యూఎస్‌బీని రూ.7,992కి, త్రీస్టార్ రేటింగ్ కలిగిన వన్ టన్ స్లిట్ ఏసీని రూ.27,990కి బదులు రూ.20,990కే లభిస్తుంది.
అలాగే రెడ్ మీ 6ఏ 2జీబీ/16జీబీ మొబైల్ ఫోన్ రూ.6,299కి, రెడ్ మీ వై2 3జీబీ/32 జీబీ ఫోన్ రూ.9,299కి, గృహోపకరణాలపై 60 శాతం డిస్కౌంట్‌తోపాటు 20 శాతం అదనపు క్యాష్ బ్యాక్ కూడా అందించనుంది.








