భువనగిరి కోటలో.. ఈసారి ’జిట్టా‘ పాగా తప్పదు.. ఇది ప్రజల మాట!

8:53 am, Thu, 29 November 18
Jitta-Balakrishna-Reddy

Jitta-Balakrishna-Reddy

అన్నీ మంచి శకునములే..అన్నట్టుగా ఈసారి  భువనగిరి నియోజకవర్గంలో ’జిట్టా బాలకృష్ణారెడ్డి’ కి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే.. మొదటిసారి పోటీ చేసినప్పుడు.. అసెంబ్లీ, పార్లమెంటు ఒకేసారి జరగడం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈయనకు వచ్చిన గుర్తు సిలిండర్ ఏదైతే ఉందో.. అదే గుర్తు ఎంపీ అభ్యర్థికి కేటాయించారు.

దీంతో ప్రజలు గందరగోళం పడటంతో.. సాధారణంగా నామినేషన్ వేసిన ఒక అభ్యర్థికి  15వేల వరకు  ఓట్లు అటు  వెళ్లిపోయాయి. దీంతో ఈయన దగ్గరలో ఓటమి పాలయ్యారు. రెండోసారి కూడా గట్టి పోటీ ఇచ్చారు. అప్పడు రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఏమైతేనేం అన్న పార్టీలను కలిసి..వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అందులో సఫలీకృతమయ్యారు.

ప్రస్తుతం బీజేపీతో కలిసి ముందడుగు వేస్తున్నారు. దీంతో ఏదైతే స్వత్రంత్ర అభ్యర్థిగా అతి తక్కువ మెజార్టీతో ఓడిపోతున్నారో.. ఇప్పడు బీజేపీ కలయికతో ఆ ఎడ్జ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   ప్రజలను కలుస్తున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజల్లో కూడా మార్పు వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తోందని పార్టీ నేతలు వ్యాక్యానిస్తున్నారు.

ఈసారి ఆరునూరైనా.. మీకే ఓటేస్తాం.. ఇంతకుముందు  రెండుసార్లు పనిచేసిన ఎమ్మెల్యేల వల్ల  పనులేవీ ముందుకు సాగలేదు..ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉంది.. జిట్టన్నకు రెండుసార్లు అన్యాయం జరిగింది. ఈసారి అవకాశం ఇస్తాం.. మాకోసం మీ సొంత సొమ్ములు  ఖర్చు పెట్టుకొని తిరిగిన మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓటేసి గెలిపిస్తామని.. వాడవాడల ముఖ్యంగా మహిళలు పేర్కొనడం విశేషం.

ఆరోజు జిట్టా పోరాడినవి.. ఇప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నవి.. వాటిలో మచ్చుకు కొన్ని..

మంచినీళ్లిచ్చి..మా కష్టాలు తీర్చిన బిడ్డ

సమస్య: కొన్నేళ్ల క్రితం.. భువనగిరి నియోజకవర్గంలో చుక్కనీరు లేదు.. తాగడానికి గుక్కెడు నీటి కోసం ఎండనకా, వాననకా గుండెలవిసిపోయేలా బిందెలు పట్టుకొని నడిచేవాళ్లు.. జ్వరమొచ్చినా, కాళ్లు పట్టేసినా.. చచ్చినట్టు  వెళ్లాల్సిందే.  కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో నిత్యం అవస్థలు పడేటోళ్లం.. మా బతుకులే ఇలా ఉంటే.. ఇక మా పిల్లగాళ్ల పరిస్థితేమిటని నిత్యం మహిళలు ఏడ్చేవాళ్లు.  ఎండాకాలమైతే.. వారి కష్టాలకు అంతే ఉండేది కాదు. మండుటెండలో కాళ్లకు చెప్పుల్లేకుండా ఆ నీళ్లకోసం ఎన్నో పాట్లు పడేటోళ్లు.

పోరాటం: సుమారు 200 కిమీ పైనే భువనగిరి నియోజకవర్గమంతా జిట్టా బాలకృష్ణారెడ్డి పాదయాత్ర చేశాడు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని గ్రామాలు మంచినీటి కోసం అవస్థలు పడుతున్నాయో స్వయంగా వెళ్లి పరిశీలించాడు. వాటన్నింటినీ నివేదిక రూపంలో రాసి.. ప్రభుత్వానికి అందజేశాడు.

పరిష్కారం: ఆ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం వెంటనే స్పందించ లేదు. దీంతో చలించిన జిట్టా.. తన జేబులోంచి ఆరోజున 118 గ్రామాలకు.. రూ.3కోట్లు ఇచ్చి మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. వారి కష్లాలు తీర్చాడు. వారి పిల్లలను ఫ్లోరోసిస్ వ్యాధి నుంచి కాపాడాడు. ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాడు.

ప్రజలేమంటున్నారు? 

మైళ్లకు మైళ్లు నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకునే బాధల నుంచి తప్పించిన జిట్టా బాలకృష్ణారెడ్డికే  ఒకసారి అవకాశం ఇచ్చి రుణం తీర్చుకుంటాం.  మంచినీటి ప్లాంట్లు కట్టడంతో మా ప్రాణాలు సుఖపడ్డాయి.  ఎప్పటి సంది ..  మా ముందే  మా ఇంట్లో పిలగాడిలా తిరిగాడు..మాకోసం తిరిగాడు..ఇప్పటికి కోపమన్నదే లేదు..మేం రెండుసార్లు గెలిపించకపోయినా.. ఇంకా మాదగ్గరకు వస్తూనే ఉంటాడు. అందరినీ అభిమానంగా పలకరిస్తాడు. మా అందరి పేర్లూ గుర్తే.. పేరు పేరునా పలకరిస్తాడు..ఇంకా అక్కా అని పిలుస్తుంటే.. మా తమ్ముడి లెక్కే అనుకుంటామని మహిళలు సంతోషంగా పేర్కొనడం విశేషం.

పోచంపల్లి… విష జలాలు

సమస్య:  మూసీ కాలుష్యం, పరిశ్రమల కాలుష్యం.. కొన్నేళ్లుగా ఈ సమస్యలతో భువనగిరి నియోజకవర్గం పోచంపల్లి మండలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ముఖ్యంగా మహిళలకు గర్భస్రావాలవుతున్నాయి. చిన్నిపల్లలు సరిగ్గా నడవలేకపోతున్నారు.. పంటలు పండటం లేదు..తాగేటందుకు నీళ్లు పనికిరావు..

పోరాటం: ఒకప్పుడు మూసీ ప్రక్షాళన కోసం మొట్టమొదటిసారి 200 కిమీ పాదయాత్ర చేసి ఈ భువనగిరి నియోజకవర్గ సమస్యను ప్రభుత్వానికి, యావద్భారత దేశానికి తెలిసేలా చేసి.. దీనిపై ఒక సమగ్ర నివేదిక ఇచ్చి.. ఆ క్రమంలోనే తన సొంత నిధులతో 118 గ్రామాల్లో వాటర్ ప్లాంట్లకు రూపకల్పన చేశాడు.

పరిష్కారం: ఒకప్పుడు మా సమస్యల కోసం పోరాడిన జిట్టా బాలకృష్ణారెడ్డికి  ఓటేస్తే.. తను గెలిస్తే ఏళ్ల తరబడి.. తెగకుండా ఉన్న సమస్యను తను పరిష్కరిస్తాడు. ప్రజల సమస్యే ముందంటాడు.. ఎటువంటి ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం..అందుకే ఈసారి జిట్టన్నకే ఓటేస్తాం.. రెండుసార్లు అన్యాయం జరిగింది. ఈసారి తప్పనిసరిగా అవకాశం ఇస్తాం.. తనైతేనే ఈ సమస్యను పరిష్కరించగలడని మేం మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం..అని అక్కడ ప్రజల మాట

ముందుకు సాగని నిమ్స్ ఆసుపత్రి..

సమస్య:   ఈ రోజు  నిమ్స్ ఆసుపత్రి మరో ప్రాంతానికి తరలివెళ్లిపోతోంది. తాగడానికి సరైన నీరు లేదు..సాగు భూమి లేదు..నిత్యం ఏదొక అనారోగ్యం.. ఏదైనా పెద్దరోగం వచ్చిందంటే ఎక్కడికో పరుగులెట్టాలి..పేదవాళ్లకు పెద్దాసుపత్రి అనేది లేదు.. పేద ప్రజలకు వైద్యం అందించే ఆసుపత్రి భువనగిరి నియోజకవర్గంలోనే ఉండకుండా ఎన్నో రాజకీయ తంత్రాలు..

పోరాటం: నిమ్స్ ఆసుపత్రి తరలి వెళ్లకుండా  ముందు నుంచి పోరాడి సాధించినది జిట్టా ఒక్కడేనన్నది ఇక్కడందరూ చెప్పే మాట.. పేద ప్రజలకు వైద్యం అందించాలనే ఒక బృహత్తర ఆశయంతో చేసిన పోరాటంలో  ఆయన మూడు రోజులు జైలు పాలయ్యాడు కూడా.. ఎప్పటికప్పుడు నిమ్స్ ను తరలించే చర్యలను అడ్డుతగులుతూనే ఉన్నాడు.  సుమారు 2006 నుంచి  అంటే 12 సంవత్సరాలుగా దీనిని నాన్చుతూనే ఉన్నారు.. ముందుకు సాగనివ్వరు..వెనక్కి లాగితే వెయ్యి కళ్లతో జిట్టా చూస్తున్నాడు.. అందుకనే దీనిని త్రిశంకు స్వర్గంలో ఉంచేశారు.

పరిష్కారం:  ఈరోజున నిమ్స్ ముందుకు సాగకపోయినా.. కేంద్ర ప్రభుత్వ  ఆసుపత్రి ఎయిమ్స్ వచ్చింది. అయితే బిల్డింగులు కడుతున్నారు. కేవలం ఓపీ మాత్రమే  చూస్తున్నారు. ఇంకా ఆపరేషన్లు అవీ జరగాల్సినది ఉంది. అంతేకాదు.. ఎయిమ్స్  వస్తే ..ఇది నిమ్స్ కన్నా పెద్దాసుపత్రి అవుతుంది. కానీ ఇది కూడా సంధిగ్థావస్థలోనే ఉంది.ఇక్కడ వారికి సర్కారు పూర్తి బాధ్యతలు ఇవ్వడం లేదు.

ఇది పూర్తి స్థాయిలో పనిచేయాలంటే జిట్టా ఒక్కడుంటేనే అవుతుంది..అదీకాక ఇప్పుడు బీజీేపీతో కలిసి తిరగడం వల్ల ఎయిమ్స్  కేంద్ర పరిధిలో ఉండటం వల్ల చిటికెలో పని అయిపోతుందని ప్రజలు నమ్ముతున్నారు.

విద్యాదానం చేసిన విద్యాదాత

సమస్య: భువనగిరిలో ఎప్పడో నిజాం నవాబులు కట్టిన భవనం అది.. ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది.  విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ..అక్కడ చదువుకునే వారు.. చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ కాలేజీకి తమ పిల్లల్ని పంపలేక, ప్రైవేటు కాలేజీలకు పంపలేక..వారినిక చదివింది చాల్లే.. కూలి పనులకి తరలించుకుపోయేవాళ్లు..అలాగే ఎంతో బాగా చదువుకునే ఆడపిల్లలను కూడా సరైన కాలేజీ లేక.. పెళ్లిళ్లు చేసే వారి భవిష్యత్తు ని ఆపేసేటోళ్లు..

అప్పడు జిట్టా బాలకృష్ణారెడ్డి అమెరికాలో ఉన్న తన మేనమామతో మాట్లాడినప్పుడు..ఆయనకు ఉన్న ఊరికి మేలు చేయాలనే ఆలోచన ఉండటంతో.. వెంటనే కోటి 20 లక్షల ఖర్చుతో భవన నిర్మాణం పూర్తయిపోయింది. ఇప్పడు జూనియర్ కాలేజీలో ప్రతి ఏడాది రెండువేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఇప్పటికి 16 ఏళ్లయ్యింది. వారందరూ ఉన్నత విద్యావంతులుగా మారి..స్వయంశక్తితో జీవిస్తున్నారు.  అంతేకాకుండా ఐదేళ్లపాటు వారికి మధ్యాహ్నభోజనం ఏర్పాటుచేశారు. అలాగే 100 మందికి పైగా పేద విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివేటందుకు ఆర్థిక సహాయం అందించారు.

విద్యార్థుల మాట:  ఇప్పటికి 16 ఏళ్లయ్యింది. ఆ కాలేజీలో చదువుకున్న అందరం..ఆయన చేసిన విద్యాదానాన్ని మరువలేం.  మాకు అన్నం పెట్టాడు.. పై చదువులు చదవాలంటే ఆదుకున్నాడు. ఇప్పుడా రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. రెండుసార్లు  అన్యాయం జరిగిన జిట్టన్నకు ఈసారి అవకాశం ఇచ్చి.. ఇంకా మరెన్నో విద్యాలయాలు కట్టి..భువనగిరిని అభివృద్ధి చేస్తాడని నమ్ముతున్నాం.

ఇవే కాదు..ఎన్నో గుప్తదానాలు చేసిన దానశీలి

అన్నా.. మా ఇంట్లో బిడ్డ పెళ్లి ఉంది.. అంటే తక్షణం పదివేలకు తక్కువ కాకుండా సాయం చేసేటోడు..అప్పటికి తన చేతిలో ఎంత ఉంటే అంత..రూ.25 వేలు లేదా రూ.50వేలు… ఇంకా ఆ పైన కూడా.. ఎవరైనా ప్రమాదంలో ఆసుపత్రి పాలయితే తక్షణం ఆసుపత్రికి వెళ్లి ఆదుకోవడమే కాదు..తను తిరిగి నడిచి వెళ్లేలా చేసేందుకు ఎంత ఖర్చయినా చేస్తాడు.. ఇలా లెక్కకు మించి గుప్తదానాలు చేసిన దానశీలి.. జిట్టా.. అందుకే ప్రజలందరి నోటా ఒకటే మాట.. ఈసారి మైకు గుర్తుకే మా ఓటు.. జిట్టన్నను గెలిపిస్తాం..అంటున్నారు

ఇది జిట్టా మాట

నేను నమ్మిన ప్రజల పట్ల  నాకు విశ్వాసం ఉంది. నన్ను వారు మరిచిపోలేదు. నేనిప్పటికి కనిపించినా..ఒక కుటుంబ సభ్యుడిలాగే పలకరిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లింట్లో సొంత బిడ్డలా భావిస్తారు. చట్టసభలకు వెళితే వారికి మరిన్ని మంచి పనులు చేసేందుకు నాకు అవకాశం ఉంటుంది. ఇప్పటికి నా శక్తిమేరకు మాత్రమే పనిశాను.

అదే నియోజకవర్గంలో ఒక బాధ్యత గల పదవిలో ఉంటే.. ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవకాశం ఉంటుంది. ప్రజలకు సేవ చేయాలనేది నేను నమ్మిన సిద్ధాంతం..ఈ సంగతి అందరికీ తెలుసు.. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి.. మార్పు ఎలా ఉంటుందో మీరే చూస్తారు.

ఊరికినే శుష్కవాగ్ధనాలు గుప్పించడం నా రక్తంలోనే లేదు. అవసరం అనుకుంటే నా సొంత సొమ్ములైనా ఖర్చు చేస్తాను తప్ప.. వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.. అని జిట్టా ప్రజలనుద్దేశించి ప్రతిజ్న చేస్తూ ప్రసంగించడం ఇప్పుడందరినీ ఆలోచనలో పడవేస్తోంది.

ఎవరెన్ని అన్నా.. పార్టీలు వేరైనా.. ప్రజల మనసులో మాత్రం జిట్టా ఉన్నాడన్నది సత్యం

అందరి మనసులో జిట్టా ఉన్నాడన్నది సత్యం.. పదిహేనేళ్లుగా మనమధ్యే ఉన్నాడు..మనతోనే ఉన్నాడు..మనం ఓడగొట్టినా మనకు   చేసే సాయం చేస్తూనే ఉన్నాడు.  ఇప్పటివరకు రూ.20 కోట్లు తెలంగాణ ఉద్యమం కోసమైతేనేం, భువనగిరి  నియోజకవర్అభివృద్ధి కోసమైతేనేం ఖర్చు చేసిండు.. అవే డబ్బులు ఆరోజుల్లో రియల్ ఎస్టేట్ పై పెట్టి పొలాలు క ొంటే.. ఈరోజున అవే వెయ్యి కోట్లు పైనే అయ్యేవి.. ప్రజలు.. ప్రజలు అంటూ పిచ్చోడిలెక్కన ప్రజల కోసం ఖర్చు  పెట్టాడు. ఇఫ్పుడందరూ ప్రజల సొమ్ములు  మెక్కెటోళ్లే గానీ.. జేబులోంచి తీసి ఇచ్చెెటోళ్లు ఎక్కడ.. అందుకే  మేం ఈసారి ఓటు జిట్టన్నకే వేస్తామని అందరూ ఘంటాపథంగా నొక్కి చెబుతున్నారు.

ఇది