తెలంగాణ ఎన్నికలు 2018: బీజేపీ రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల, మొత్తం 28 మంది అభ్యర్థులతో…

BJP-Logo-BJP
- Advertisement -

BJP-Logo-BJP

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 28 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ తన రెండో విడత జాబితా విడుదల చేసింది. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ  సమావేశం అయింది. నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులను కమిటీ ఖరారు చేసింది.

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌తో పాటు ఆ పార్టీ అగ్రనాయకులు పలువురు  పాల్గొన్నారు.

తెలంగాణతో పాటు మిజోరంలో పోటీ చేసే 24 మంది అభ్యర్థులు, మధ్యప్రదేశ్‌లో పోటీ చేసే 177 మంది అభ్యర్థులను కూడా బీజేపీ నాయకులు ఖరారు చేశారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సెక్రటరీ జేపీ నడ్డా ఒక లేఖ విడుదల చేశారు.

రెండో విడత బీజేపీ తెలంగాణ అభ్యర్థులు వివరాలు…

నియోజకవర్గం                     అభ్యర్థి పేరు

1.  ఆసిఫాబాద్‌(ఎస్టీ)              అజ్మీరా ఆత్మారాం నాయక్‌
2.  ఖానాపూర్‌(ఎస్టీ)              సాట్ల అశోక్‌
3.  నిర్మల్‌                             డాక్టర్‌ ఐండ్ల సువర్ణా రెడ్డి
4.  నిజామాబాద్‌ అర్బన్‌        యెండల లక్ష్మీనారాయణ
5.  సిర్పూర్‌                           డాక్టర్‌ శ్రీనివాసులు
6.  జగిత్యాల                         మూడుగంటి రవీందర్‌ రెడ్డి
7.  రామగుండం                    బల్మూరి వనిత
8.  సిరిసిల్ల                           మల్లాగారి నర్సాగౌడ్‌
9.  కూకట్‌ పల్లి                      మాధవరం కాంతా రావు
10. సిద్ధిపేట                          నైని నరోత్తం రెడ్డి
11. రాజేంద్రనగర్‌                    బద్దం బాల్‌ రెడ్డి
12. శేరిలింగం పల్లి                  జి. యోగానంద్‌
13. మలక్‌ పేట్‌                     ఆలె జితేంద్ర
14. చార్మినార్‌                       టి. ఉమా మహేంద్ర
15. చాంద్రాయణగుట్ట             సయ్యద్‌ షాహజాదీ
16. యాకుత్‌పురా                 చర్మాని రూప్‌రాజ్‌
17. బహదూర్‌పురా                హనీఫ్‌ అలీ
18. దేవరకొండ                      అగ్గని నర్సింహులు సాగర్‌
19. వనపర్తి                           కొత్త అమరేందర్‌ రెడ్డి
20. నాగర్‌ కర్నూల్‌               నేదనూరి దిలిప్‌ చారి
21. నాగార్జున్‌ సాగర్‌              కంకనాల నివేదిత
22. ఆలేరు                           దొంతిరి శ్రీధర్‌ రెడ్డి
23. స్టేషన్‌ ఘన్‌పూర్‌(ఎస్సీ)  పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
24. వరంగల్‌ వెస్ట్‌                 ఎం ధర్మారావు
25. వర్ధన్నపేట(ఎస్సీ)          కొంత సారంగ రావు
26. ఇల్లెందు(ఎస్టీ)               మోకాళ్ల నాగ స్రవంతి
27. వైరా(ఎస్టీ)                     భూక్యా రేష్మా భాయి
28. అశ్వారావు పేట             డాక్టర్‌ భూక్యా ప్రసాద రావు

- Advertisement -