
- Advertisement -

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్కరే కాస్త ధైర్యమున్న నేతని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ కుంభకోణం, అనిల్ అంబానీ, రైతుల ఆవేదన, వ్యవస్థల నిర్వీర్యం గురించి కూడా మాట్లాడాలని నితిన్‌ని రాహుల్ కోరుతూ ఓ ట్వీట్ చేశారు.
మరో ముఖ్యమైన విషయం మరిచిపోయాను ‘గడ్కరీ జీ.. జాబ్స్!, జాబ్స్!’ అని, దీనిపైనా వ్యాఖ్యానించాలని కోరుతూ రాహుల్ మరో ట్వీట్ చేశారు. కాగా, చాలా మంది కార్యకర్తలు ముందుగా తమ ఇంటిని, ఇల్లాలిని, పిల్లలను చూసుకోలేనివాళ్లు దేశాన్ని ఏం కాపాడతారని నితిన్ గడ్కరీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.
నాగపూర్ లోని ఏబీవీపీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. గడ్కరీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పైవిధంగా స్పందించారు.
- Advertisement -








