25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ వైసీపీ సైకో పార్టీ! కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు : సీఎం చంద్రబాబు!

వైసీపీ సైకో పార్టీ! కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు : సీఎం చంద్రబాబు!

ap cm chandrababu naidu
- Advertisement -

chandrababu naidu fires on jaganmohanreddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజు రోజుకి ఉగ్రరూపం దాల్చుతుంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలకి మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండటంతో తమ తమ వ్యూహాలతో ఓటర్లని ఆకర్షించడానికి తహతహలాడుతున్నారు. అలాగే ఏపీలో ప్రభుత్వ పక్షమైన టీడీపీ, ప్రతిపక్షమైన వైసీపీ వచ్చే ఎన్నికలలో అధికారం కోసం తమవంతు ప్రయత్నాలు అప్పుడే మొదలుపెట్టారు.

ఇకపోతే జగన్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఏపీలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మీడియా సమావేశంలో టీడీపీని తీవ్రంగా విమర్శించాడు. దీనిపై సీఎం చంద్రబాబు వైసీపీ అలాగే అధినేత జగన్ పై మండిపడ్డాడు.

జగన్ శాడిజానికి ప్రత్యక్ష నిదర్శనం..

ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరీ ఇంత నీచానికి దిగజారొద్దని హితవు పలికారు. టీడీపీలోనూ, ప్రభుత్వంలోనూ అన్ని కులాలు ఉన్నాయని, కానీ ప్రతిపక్ష నేత జగన్ ఒకే కులానికి వంతపాడుతున్నారని విమర్శించారు.

అది ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదన్నారు. కులాలకు, అధికారులకు సంబంధం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌లో శాడిజం పెరిగిపోయిందని, ఆయన పార్టీ సైకో పార్టీగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడడం జగన్ శాడిజానికి ప్రత్యక్ష నిదర్శనమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చదవండి : కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్ ఫిర్యాదు !

- Advertisement -