30.2 C
Hyderabad
Saturday, November 7, 2026
- Advertisement -
Home ఎన్ఆర్ఐ అమెరికా శిఖా చౌదరిని రహస్యంగా తరలించిన పోలీసులు! కారణం ఏంటి!

శిఖా చౌదరిని రహస్యంగా తరలించిన పోలీసులు! కారణం ఏంటి!

sikha choudary
- Advertisement -

 

sikha choudary

ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్‌ (55) హత్య కేసులో ఆయన మేనకోడలు శిఖా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జయరామ్‌ను శిఖాచౌదరి ప్రియుడు రాకేష్‌రెడ్డే చంపాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శేఖర్ రెడ్డి స్వయంగా చెప్పడంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందని అందరూ అనుకున్నారు.

కానీ, ఇక్కడే ఉంది మరో కోణం. జయరామ్ హత్య జరిగినప్పటినుండి అయన మేనకోడలు శిఖాచౌదరిని పోలీసులు నందిగామ కార్యాలయంలో విచారిస్తున్న విషయం తెలిసందే. గత రాత్రి హైడ్రామా మధ్య రహస్య ప్రాంతానికి తరలించారు. ఊరంతా కరెంట్ తీసేసిన పోలీసులు, అంతకుముందే రెండు వాహనాలను స్టేషన్ ముందు సిద్ధం చేసివుంచారు. ఒక వాహనంలో శిఖాను ఎక్కించారు. ఏ వాహనంలో ఆమె ఉందో మీడియా కంటపడకుండా జాగ్రత్త పడ్డారు .

జయరామ్ హత్య కేసులో పోలీసుల హైడ్రామా..

తెల్లవారితే జయరామ్ హత్య కేసులో మీడియా సమావేశం ఉందని చెప్పిన పోలీసులు అర్ధరాత్రి సమయంలో శిఖా చౌదరిని రహస్య ప్రాంతానికి తరలించడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు గురయిన జయరామ్‌ భార్య పద్మశ్రీ, మేనకోడలు శిఖాచౌదరిపై సంచలన ఆరోపణలు చేశారు. శిఖా చౌదరిది క్రిమినల్‌ మైండ్‌ అంటూ చెప్పారు.

కాగా, జయరామ్ హత్య హైదరాబాద్ లో జరిగినట్టు తేలడంతో, కేసును ఇక్కడి పోలీసులకే అప్పగించాలని నిర్ణయించుకున్న కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు, ఆమెను హైదరాబాద్ కే తరలించినట్టు తెలుస్తోంది.

చదవండి : జయరామ్ మృతి : శిఖా చౌదరి అరెస్ట్ అయ్యే అవకాశం ! 

చిగురుపాటి మృతి కేసులో వెలుగులోకి నమ్మలేని నిజాలు! రెండు రోజుల క్రితమే కిడ్నాప్?

జయరామ్ మృతి : యాంకర్ ద్వారా ఇంటికి పిలిపించా.. అక్కడే చంపేశా ! రాకేష్ రెడ్డి వెల్లడి !

- Advertisement -