ముంబై: టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకుంటే దాని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అదే సమయంలో టెక్నాలజీని దుర్వినియోగపరిస్తే దాని వల్ల కలిగే నష్టాలను సైతం భరించాల్సి వస్తుంది. తాజాగా ఓ మహిళ చేసిన చిన్న తప్పు వల్ల సమాజంవైపు తలెత్తుకోలేని పరిస్థితి ఆమెకు ఏర్పడింది.
మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ భర్త ఐదేళ్ల క్రితం వృత్తి రీత్యా బల్గేరియా వెళ్లి అక్కడే నివసిస్తున్నాడు. భర్తతో రోజూ చాటింగ్ చేయడం, ఫోన్లు చేయడం చేస్తూ వస్తున్న మహిళ భర్తకు అప్పుడప్పుడు తన న్యూడ్ వీడియోలను సైతం పంపిస్తూ ఉండేది.
అయితే న్యూడ్ వీడియోలపై వాట్సాప్‌లో కొన్ని రకాల ఆంక్షలు విధించడంతో.. ఆమె భర్త తన భార్య న్యూడ్ వీడియోను ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా పంపమని కోరాడు.
ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వెళ్లిన వీడియో…
సరేనని చెప్పిన మహిళ మెసెంజర్ కాకుండా పొరపాటున ఫేస్‌బుక్ లైవ్ ఓపెన్ చేసి తన బట్టలు విప్పేసింది. వీడియో తన భర్తకు మాత్రమే వెళ్తోందనుకున్న మహిళ వీడియోలో రెచ్చిపోయింది. కానీ, ఆ వీడియో ఆమె ఫేస్‌బుక్‌లో ఉన్న 2000 మంది స్నేహితులకు కూడా వెళ్లిపోయింది. విషయం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
విదేశాల్లో చదువుకుంటున్న ఆమె కొడుకు కూడా ఈ వీడియో చూసి కొన్నేళ్ల పాటు ఇంటికి రానని చెప్పేశాడు. ఎన్నారై భర్త తన భార్యతో మాట్లాడనని చెబుతున్నాడు. కూతురి వల్ల తమ కుటుంబ పరువు పోయిందని ఆ మహిళ తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరి కొంతమంది మృగాళ్లు తమ కోరిక తీర్చాల్సిందిగా అసభ్య సందేశాలను పంపుతున్నారు. తెలియక చేసిన చిన్న పొరపాటు ఎంత పని చేసిందో చూడండి!








