34.3 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఎమ్మెల్యే అంతమాట అంటారా?.. రోడ్డెక్కిన వేలాదిమంది

ఎమ్మెల్యే అంతమాట అంటారా?.. రోడ్డెక్కిన వేలాదిమంది

- Advertisement -

బళ్లారి : పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా నిన్న నిర్వహించిన బహిరంగసభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బళ్లారి బీజేపీ ఎమ్మెల్యే జి.సోమశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు, వేలాదిమంది ముస్లింలు స్థానిక రాయల్ సర్కిల్‌లో ఆందోళన చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము 80 శాతం మందిమి ఉన్నామని, మీరు కేవలం 15 శాతం మాత్రమేనని హెచ్చరించారు. మీరు మైనారిటీలని తేల్చిచెప్పారు. మెజారిటీ ప్రజలు మీకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించాలని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని గౌరవించని వారు దేశం వదిలి వెళ్లాలన్నారు.

ఆయన వ్యాఖ్యలపై మండిపడిన జనం వేలాదిమంది రోడ్డెక్కారు. కులమతాల ఘర్షణకు దారి తీసేలా ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమన్నారు. ఎమ్మెల్యేని, దేశభక్త నాగరికర వేదిక పదాధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ సీకే బాబాకు వినతిపత్రం అందజేశారు.

దాదాపు రెండుగంటలకు పైగా ధర్నా జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ బాబా ఆందోళనకారులకు నచ్చజెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపాలని సూచించారు. ఎమ్మెల్యేపై ఇచ్చిన కేసును స్వీకరిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -