23.7 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం షాకింగ్: ప్రధాని మోడీ భద్రత కోసం రోజుకు ఎంత ఖర్చో తెలుసా!?

షాకింగ్: ప్రధాని మోడీ భద్రత కోసం రోజుకు ఎంత ఖర్చో తెలుసా!?

- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ భద్రతకు రోజుకు రూ.1.62 కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభకు తెలిపారు.

దేశంలో ఎంతమంది ప్రముఖులకు ఎస్పీజీ, సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నారన్న డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలో ఒకే ఒక్క వ్యక్తి ఎస్పీజీ భద్రత పొందుతున్నారనంటూ పరోక్షంగా ప్రధాని మోదీ పేరును ప్రస్తావించిన మంత్రి.. ఇందుకోసం రోజుకు దాదాపు 1.62 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు.

ఇక మొత్తంగా 56 మందికి వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. మొత్తం 3 వేల మంది ప్రత్యేక కమాండోలు ఉన్న ఎస్పీజీకి ఇటీవలి కేంద్రం బడ్జెట్‌లో రూ.592.55 కోట్లు కేటాయించారు.

గతంలో ఈ కేటాయింపు రూ.540 కోట్లు కాగా, ఈసారి దానికి పది శాతం పెంచి కేటాయింపులు జరిపారు. నిన్నమొన్నటి వరకు ప్రధానితోపాటు గాంధీ కుటుంబానికి చెందిన ముగ్గురికి ఎస్పీజీ భద్రత ఉండగా, గతేడాది నవంబరులో కేంద్రం దానిని ఉపసంహరించింది. 

- Advertisement -