రాయ్‌గఢ్: ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో ఒడిశా అతలాకుతలం అవుతోంది. రాయ్‌గఢ్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైల్వే ట్రాక్‌లపైకి కూడా వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అతరాయం ఏర్పడింది.
రాయ్‌గఢ్ జిల్లా లక్ష్మీపురం సమీపంలోని బాలుమస్కాస్టేషన్ వద్ద భువనేశ్వర్ నుంచి జగ్దల్‌పూర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వరద నీటిలో చిక్కుకుపోయింది. ట్రైన్ బోగీలోకి నీరు వచ్చి చేరింది. వరద నీటిలో ట్రైన్ చిక్కుకుపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.
దీంతో రైల్వే అధికారులు ట్రైన్‌ను ఆపివేశారు. వరద ఉధృతి తగ్గాక ట్రైన్ కదిలే అవకాశం ఉంది. అలాగే సింగిపురం-టికిరి స్టేషన్ల మధ్య కూడా మరో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.
#WATCH Bhubaneswar-Jagdalpur Hirakhand Express gets stuck after rail tracks were submerged near a station in Rayagada district following heavy rain in the region. #Odisha (Source:Mobile footage) pic.twitter.com/uVUgrYUpd4
— ANI (@ANI) July 21, 2018