24.9 C
Hyderabad
Sunday, October 11, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం టీవీ వీక్షకులకు శుభవార్త! చానళ్ల ఎంపికకు మరింత గడువు ఇచ్చిన ట్రాయ్…

టీవీ వీక్షకులకు శుభవార్త! చానళ్ల ఎంపికకు మరింత గడువు ఇచ్చిన ట్రాయ్…

deadline-for-selecting-channels-march31, newsxpress.online
- Advertisement -

choose-your-own-channels-says-trai, newsxpress.online

న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త నిబంధనల ప్రకారం.. మీ టీవీ చానళ్ల ప్యాకేజీని మీరే ఎంచుకోవాలి. కొత్త బ్రాడ్‌కాస్టింగ్‌ విధానం 2018 డిసెంబర్‌ 29నే అమల్లోకి వచ్చినప్పటికీ.. టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా ట్రాయ్‌ గడువిచ్చింది. తాజాగా ఈ గడువును మరింత పెంచింది. టీవీ వీక్షకులకు మార్చి 31 వరకు గడువునిస్తున్నట్లు పేర్కొంది.

దేశవ్యాప్తంగా 10 కోట్ల కేబుల్‌ కనెక్షన్లు, 6.7 కోట్ల డీటీహెచ్‌ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. ఇప్పటికే 65 శాతం కేబుల్‌ యూజర్లు, 35 శాతం డీటీహెచ్‌ యూజర్లు తమకు కావాల్సిన చానళ్లను ఎంపిక చేసుకున్నట్లు ట్రాయ్‌ గణాంకాలు తెలుపుతున్నాయి.

వినియోగదారులు ఎంచుకోకపోయి ఉంటే..

ఒకవేళ వినియోగదారులు తమకు నచ్చిన చానళ్లను ఎంచుకోకపోయి ఉంటే.. అలాంటి వారికి బెస్ట్ ఫిట్ ప్లాన్లను అందించాలని డిస్ట్రిబ్యూషన్‌ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లను (కేబుల్‌ ఆపరేటర్లు) ట్రాయ్ ఆదేశించింది. దీనికోసం కస్టమర్ల ప్రాధాన్యాలు, భాష, పాపులర్‌ ఛానళ్లు వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా సూచించింది.

మరి ఇప్పటికీ కూడా తమకు నచ్చిన చానళ్లను ఎంపిక చేసుకోని వినియోగదారులు మార్చి 31లోగా ఎప్పుడైనా కేబుల్ ఆపరేటర్లు అందించే ప్లాన్లను మార్చుకోవచ్చు. సంబంధిత కేబుల్ ఆపరేటర్లకు తెలియజేసి 72 గంటల్లో వినియోగదారులు తమ ప్లాన్లను మార్చుకోవచ్చు.

- Advertisement -