27.1 C
Hyderabad
Saturday, November 28, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం లొంగిపోతే వదిలేస్తాం.. కాదని తుపాకీ ఎత్తారా కాల్చిపారేస్తాం!: ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

లొంగిపోతే వదిలేస్తాం.. కాదని తుపాకీ ఎత్తారా కాల్చిపారేస్తాం!: ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ వార్నింగ్

Army Sends Out A Strong Message to Mothers of Kashmiri Terrorists, newsxpress.online
- Advertisement -

Army Sends Out A Strong Message to Kashmiri Mothers

న్యూఢిల్లీ: ‘‘ఆయుధాలు వదిలి లొంగిపోతే వదిలేస్తాం.. లేదని తుపాకీ చేతబట్టారా కాల్చిపారేస్తాం..’’ అంటూ భారత సైన్యాధికారులు తీవ్ర హెచ్చరిక చేశారు. కశ్మీర్‌ లోయలో ఇకమీదట ఎవరైనా తుపాకి చేతబడితే అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు.

ఈ నెల 14న పుల్వామా జిల్లాలోని అవంతిపురలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనశ్రేణిపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కారుబాంబుతో ఆత్మాహుతి దాడి జరిపి మన జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

లొంగిపోతే సరే, లేదంటే మాత్రం…

ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ సీరియస్‌గా తీసుకుంది. మంగళవారం ఆర్మీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు హెచ్చరిక జారీ చేశారు. స్థానిక ఉగ్రవాదుల తల్లులకు తాను ఒక్కటే మనవి చేస్తున్నానని, వారి పిల్లలు ఆయుధాలు వీడి లొంగిపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని, లేదంటే మాత్రం కాల్చిపారేస్తామని హెచ్చరించారు.

‘‘కశ్మీర్ సమాజంలో అమ్మలు కీలక పాత్ర పోషిస్తారు.. ఉగ్రవాదంలో చేరిన మీ పిల్లలను దయచేసి వెనక్కు రప్పించి, జనజీవన స్రవంతిలో చేరడానికి సహకరించండి.. అలా కాకుండా ఎవరైనా తుపాకులు, ఆయుధాలు చేతబడితే మాత్రం అలాంటి వారిని మట్టుబెడతాం..’’ అంటూ ధిల్లాన్ తీవ్ర స్వరంతో చెప్పారు.

గతవారం జరిగిన పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు ఇప్పటికే పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించిందని, ఇందులో ఆ దేశ గూఢచారి సంస్థ ఐఎస్ఐ హస్తం కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టింతా ఉగ్రవాద కార్యకలాపాలపైనే ఉందని, ఎవరైనా కశ్మీర్ లోయలోకి చొరబడితే ప్రాణాలతో తిరిగి వెళ్లబోరంటూ ఆయన పునరుద్ఘాటించారు.

పుల్వామా సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి తర్వాత కీలక ఉగ్రవాదులను హతమార్చామని, వీరంతా ఐఎస్ఐ, పాకిస్తాన్, జైషే మహ్మద్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని వివరించారు.

ఇక జైషే మహ్మద్ అగ్ర నేతలే టార్గెట్…

ఇక సైన్యం తదుపరి లక్ష్యం కశ్మీర్‌ లోయలోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అగ్ర నేతలేనని ఆర్మీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ స్పష్టం చేశారు. పుల్వామా ఘటన తర్వాత 100 గంటల్లోనే ఆ సంస్థకు చెందిన కీలక ఉగ్రవాదులను తాము మట్టుబెట్టామని అన్నారు.

సోమవారం పింగ్‌లాన్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో పుల్వామా సూత్రధారి అబ్దుల్ రషీద్ ఘాజీతో సహా ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిందని చెప్పారు. గాయపడి సెలవులో ఉన్న బ్రిగేడియర్ హర్‌దీప్ సింగ్ తనకు తానుగా వచ్చి ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నారని, గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన ఈ ఆపరేషన్‌ను ముందుండి నడిపించారంటూ ధిల్లాన్.. బ్రిగేడియర్ హర్‌దీప్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు.

- Advertisement -