ఓవర్‌లోడ్ ఫలితం.. ట్రక్కుకు రూ.2 లక్షల జరిమానా.. ఇదే తొలిసారి!

6:41 am, Fri, 13 September 19

న్యూఢిల్లీ: ఓవర్ లోడుతో వెళ్తూ దొరికిన ఓ ట్రక్కుకు ఢిల్లీ పోలీసులు భారీ జరిమానా విధించారు. రాజధానిలోని  ముబారక్ చౌక్ సమీపంలో అధిక లోడుతో వెళ్తున్న ట్రక్కును గుర్తించిన పోలీసులు దానిని అడ్డుకున్నారు.

అనంతరం లోడును పరిశీలించి సామర్థ్యానికి మించిన లోడు ఉన్నట్టు గుర్తించారు. దీంతో కొత్త చట్టం ప్రకారం ఏకంగా రూ. 2 లక్షల జరిమానా విధించారు. దేశంలో కొత్త చట్టం అమల్లోకి వచ్చాక ఇంత భారీ ఎత్తున జరిమానా విధించడం ఇదే తొలిసారి.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచి కొత్త చట్టటం అమల్లోకి రాగా, తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురాలేదు.