
- Advertisement -
విజయవాడ: తాను బీజేపీలో చేరుతున్న మాట వాస్తవమేనని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పానని వెల్లడించారు.
పార్టీతో తనకు ఎటువంటి విభేదాలు లేవని, స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నానని వివరించారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని మాజీ మంత్రి మండిపడ్డారు.
జగన్ దాష్టీకాలను ఎదుర్కొనేందుకు బీజేపీలాంటి పార్టీ అవసరమన్నారు. బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరాలా? లేదంటే తన నియోజకవర్గంలో బహిరంగసభ ఏర్పాటు చేసి చేరాలా? అన్న విషయమై నేడు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
- Advertisement -








