ఆశ్చర్యం: 44 ఏళ్లుగా.. నేలపై కాలుమోపని బాబా! 1975 నుంచి మండపంపైనే…

kumbh-mela-machan-wale-baba
- Advertisement -

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కుంభమేళా సందర్భంగా దేశ, విదేశాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కోట్లాది భక్తులు ఇక్కడి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

చదవండి: ‘కుంభమేళా’ గురించి మీకేం తెలుసు?

మరోవైపు కుంభమేళాకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సాధువులు, నాగా బాబాలు తరలివస్తుండడంతో కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో విభిన్న వాతావరణం నెలకొంది. నాగ సాధువులు ఎక్కువ రోజులు గుహలు, కొండల్లోనే నివసిస్తుంటారు. వీరు బయట ఎక్కడా ఎవరికీ కనిపించరు. కుంభమేళా జరిగే రోజుల్లో మాత్రమే బయటకు వచ్చి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి తిరిగివెళుతుంటారు.

1975 నుంచి మండపంపైనే…

‘మచాన్ వాలే బాబా’గా పేరొందిన శ్రీ మహంత్ రామ్ క్రిష్ణ దాస్ త్యాగి మహారాజ్ అనే బాబా ఇక్కడి అనేకమంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. ఆయన 1975 నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెండాల్ (మండపం) మీద గడుపుతున్నట్లు చెబుతున్నారు. గత 44 ఏళ్లలో తాను నేల మీదకు దిగిన రోజులు చాలా తక్కువని, భక్తులను కూడా పెండాల్‌పై నుంచే ఆశీర్వదిస్తానని మచాన్ వాలే బాబా పేర్కొన్నారు.

కుంభమేళాకు తరలివస్తున్న భక్తులకు 24/7 సేవలు అందిస్తున్నారు. రోజూ సుమారు 5 వేల మందికి ఉచిత సేవలు అందిస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా ఉచిత మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. 55 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాలో సుమారు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారుల అంచనా.

- Advertisement -