

చెన్నై: ప్రస్తుతం యువత బాగా కనెక్ట్ అయిన యాప్ ‘టిక్ టాక్’. చూడటానికి ఇది డబ్‌స్మాష్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో మ్యూజిక్ వీడియోస్ ఉంటాయి. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్.. ఇలా అన్నింటినీ లోకానికి పరిచయం చేసే అవకాశం ఉండటతో యూత్ ఈ యాప్‌కు ఫిదా అయ్యారు.
యువత చెడుదారికి దారితీస్తుందనే…
అయితే ఈ యాప్‌ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ హన్సారీ మాట్లాడుతూ.. టిక్ టాక్ యాప్‌ను తక్షణమే రాష్ట్రంలో నిషేధించాలని కోరారు.
ఇందులో అశ్లీల చిత్రాలు, పలు వర్గాలు, మతాల మధ్య హింసను ప్రేరేపించే సంభాషణలు అధికంగా ఉన్నాయన్నారు. అందువల్ల ఈ యాప్‌ను నిషేధించాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో తమిళనాడు రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి మణికంఠన్ సమాధానం ఇస్తూ.. ‘టిక్ టాక్’ యాప్‌ను నిషేధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.








