29.2 C
Hyderabad
Thursday, November 26, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ ఓటుకు నోటు కేసు: రేవంత్, ఉదయసింహకు ఈడీ నోటీసులు

ఓటుకు నోటు కేసు: రేవంత్, ఉదయసింహకు ఈడీ నోటీసులు

revanth reddy-notice
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఈడీ నోటీసులు పంపింది. ఫిబ్రవరి 19న ఈడీ ఎదుట హాజరుకావాలని పేర్కొంది. రేవంత్ రెడ్డితోపాటు మరో నేత ఉదయసింహకు కూడా నోటీసులు పంపినట్లు తెలిసింది.

ఇది ఇలా ఉండగా, మరో కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డిని ఈడీ ఓటుకు నోటు కేసులోని రూ.50లక్షల గురించి ప్రశ్నించింది. నరేందర్ రెడ్డితోపాటు ఆయన కుమారుడు కీర్తన్ రెడ్డి కూడా ఈడీ ప్రశ్నించింది.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయలు, మిగితా నాలుగున్నర కోట్ల గురించి కూడా ఆరా తీసింది. సుమారు ఆరుగంటలపాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది.

పిల్లల్ని కూడా వేధిస్తున్నారు: వేం నరేందర్ రెడ్డి

విచారణ అనంతరం వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. మూడున్నరేళ్ల తర్వాత ఎందుకు మళ్లీ విచారిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని అన్నారు. తనతోపాటు తన పిల్లల్పి కూడా విచారణకు పిలిపించి వేధిస్తున్నారని అన్నారు. ఈడీ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పానని తెలిపారు.

చదవండి: ఓటుకు నోటు కేసు: వేం నరేందర్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం

- Advertisement -