
- Advertisement -
భోపాల్: ఢిల్లీ, నిజాముద్దీన్‌లోని తబ్లిఘి జమాత్ సంస్థకు చెందిన 64 మంది విదేశీయులను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తబ్లిఘి జమాత్ సంస్థతో 10 మంది భారతీయులకు సంబంధాలు ఉన్నాయని, మరో 13 మంది తబ్లిఘి జమాత్ సభ్యులకు భోపాల్‌లో వసతి ఏర్పాట్లు చేశారని భోపాల్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 270, సెక్షన్ 13 డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌యాక్ట్, సెక్షన్ 14 ఫారినర్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ లో ఇప్పటికే తబ్లిఘి జమాత్ కార్యక్రమానికి హాజరైన పలువురిని గుర్తించి.. క్వారంటైన్కు తరలించిన విషయం తెలిసిందే.
చదవండి: విమానాశ్రయంలో 8 మంది మలేషియన్ల అరెస్ట్.. మర్కజ్‌తో లింకు
- Advertisement -








