25 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు ఆంధ్రప్రదేశ్ చెడుపై మంచి ద్వారానే విజయం.. క్రీస్తు బోధన అనుసరణీయం: పవన్ కల్యాణ్

చెడుపై మంచి ద్వారానే విజయం.. క్రీస్తు బోధన అనుసరణీయం: పవన్ కల్యాణ్

- Advertisement -

అమరావతి: క్రీస్తు బోధనలు అనుసరణీయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. క్షమా గుణాన్ని మానవాళికి తన సందేశంగా అందించిన క్రీస్తు పరమపదించిన రోజే గుడ్ ఫ్రైడే అని అన్నారు.

చదవండి: ‘గుడ్ ఫ్రైడే’ ప్రాముఖ్యత ఏమిటి? ఏసు మరణించిన రోజును ఇలా ఎందుకు పిలుస్తారు?

ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజని, తనను శిలువ వేసిన వారిని క్షమించిన భగవత్ స్వరూపుడు క్రీస్తు అని పేర్కొన్నారు. 

చెడుపై మంచి ద్వారానే విజయం…

చెడుపై మంచి ద్వారానే విజయం సాధించగలమని, శాంతి, సహనం, అహింస ద్వారా మనిషి మనుగడ సాగించాలని యేసు చేసిన బోధనలు ఆచరణీయమన్నారు.

మానవాళిని పాపాల నుంచి విముక్తి చేయడానికి క్రీస్తు ఆత్మార్పణ చేయడం వల్లే ఈ రోజు కావడం వల్లే ఈ రోజును శుభ శుక్రవారంగా పాటిస్తారని పవన్ తెలిపారు. 

చదవండి: గుడ్‌ ఫ్రైడే: ఏసుక్రీస్తును ఎలా హింసించారో, శిలువపై ఆయన పలికిన మాటలు ఏమిటో తెలుసా?

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ తన తరపున, జన సైనికుల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. 

- Advertisement -