బాణసంచా హానికరం.. సుప్రీంకోర్టు ఆంక్షలు…

supreme-court
- Advertisement -

fire crackers

న్యూఢిల్లీ : దేశంలో బాణాసంచా నిషేధంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. బాణాసంచా తయారీ, విక్రయాలను పూర్తిగా నిషేధించలేమని స్పష్టం చేసింది. లైసెన్స్‌ కలిగిన వ్యాపారులే బాణాసంచా విక్రయించాలని, ఆన్‌లైన్‌లో వీటి విక్రయాలు చేయకూడదని పేర్కొంది.

గత ఏడాది దీపావళికి ముందు అక్టోబర్‌ 9న ఢిల్లీలో బాణాసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధించింది. ఈ ప్రాంతంలో కాలుష్య  స్థాయిలపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు బాణాసంచా విక్రయాలను నిషేధించినట్టు సుప్రీం కోర్టు న్యాయస్థానం పేర్కొంది.

బాణాసంచాని రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకే  కాల్చాలని సూచించింది. అదికూడా పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని గ్రీన్ కాకర్స్ మాత్రమే కాల్చాలని పేర్కొంది. అలాగే క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ రోజు రాత్రి 11.45 నుంచి గంటపాటు మాత్రమే అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

తయారీదారుల ఉపాధి హక్కుతో పాటు దేశం‍లోని దాదాపు 130 కోట్ల మంది ఆరోగ్యంగా జీవించడాన్ని కూడా ఆలోచించాలని.. ఈ విషయంలో అనేకాంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గతంలోనే పేర్కొంది. దేశవ్యాప్తంగా కాలుష్యం విపరీతంగా పెరగడంతో బాణా సంచా పేలుళ్లతో ఇవి తీవ్రమవుతున్నాయని, ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు అందరిది కావడంతో బాణాసంచాపై దేశవ్యాప్త నిషేధం విధించే క్రమంలో సమతూకం పాటించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాణాసంచా పేలుళ్లతో ప్రజలపై పడుతున్న ప్రభావం వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది.

ఒక తమిళనాడులోనే 1750 బాణాసంచా తయారీ పరిశ్రమలున్నాయని, వీటిపై 5000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయని కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.  6000 కోట్ల రూపాయల బాణాసంచా పరిశ్రమ మనుగడను సైతం తాము తీసుకునే నిర్ణయం ప్రభావితం చేస్తుందని సుప్రీం కోర్టు బెంచ్‌ వ్యాఖ్యానించింది.

మరోవైపు బాణాసంచాను పూర్తిగా నిషేధించరాదని, వీటిని క్రమబద్ధీకరించాలని బాణాసంచా తయారీదారులు కోరుతున్నారు. అయితే ఎన్ని ఉన్నా చట్టాలు..తీర్పులు ప్రభావం ఎంత వరకు ఉంటుందని, దానిని కఠినంగా అమలుచేయాల్సిన బాధ్యత అధికారులు, పోలీసులు, రాష్ట్రాలపై ఉందని, ఎవరి సొంత లాభాన్ని వారు చూసుకుంటూ, సొంత ప్రయోజనాలు కాపాడుకుంటారని కొందరు పేర్కొంటున్నారు.

ఉదాహరణకి సంక్రాంతి రోజుల్లో  ఉభయ గోదావరి జిల్లాల్లో కోట్ల రూపాయలతో కోడిపందాల పోటీలు జరుగుతుంటాయి.  తర్వాత మూడు రోజులు మాత్రమే అనుమతులు వస్తుంటాయి. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమాలు..అయితే ఇవన్నీ ప్రజల్లో ఉండాలి..అమలు చేయాల్సిన ప్రభుత్వాలు, అధికారులు, పోలీసులపై  ఉండాలి. అప్పుడే ఒక మంచి తీర్పుకి అర్థం ఉంటుంది. ఈరోజున ఢిల్లీలో ఈ కాలుష్యంలో మంచు కలిసిపోయి ప్రజల ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. అందుకే సుప్రీం కోర్టు తీర్పుని అందరూ గౌరవించాలి.

 

- Advertisement -