
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా సోనియాగాంధీ ఎన్నికయ్యారు. ఈరోజు ఢిల్లీలో ఏఐసిసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆమెను పార్టీ పార్లమెంటరీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అయితే ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రాజీమానా సమర్పించడంతో సోనియా అరంగేట్రం అనివార్యమయింది. తొలుత సోనియా పేరును మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ ప్రతిపాదించగా, పార్టీ నేతలంతా ఆమోదం తెలిపారు.
అయితే గత ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన ఖర్గే ఈ లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని కలబురిగి లోక్ సభ స్థానంలో తొలిసారి ఓటమి చవిచూశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కొత్తవారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ రాయబరేలి నుంచి బీజేపీ అభ్యర్ధిపై 1.6 లక్షలు తేడాతో గెలిచారు.
చదవండి: కర్ణాటక స్థానిక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్..








