28.3 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home అంతర్జాతీయం అధ్యక్షా.. ఇదేం పని?: భార్య ఎదుటే ఐదుగురు మహిళలతో…

అధ్యక్షా.. ఇదేం పని?: భార్య ఎదుటే ఐదుగురు మహిళలతో…

- Advertisement -

టోక్యో: జపాన్ పర్యటనలో ఉన్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూరెట్టి సిగ్గు విడిచారు. మహిళలను చూసి రెచ్చిపోయారు. సమావేశంలో ఏకంగా ఐదుగురు మహిళలను చుంబించి తన వెకిలి చేష్టలను ప్రపంచానికి చూపించారు.

నాలుగు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ వెళ్లిన రోడ్రిగో చివరి రోజున జపాన్‌లో నివసిస్తున్న ఫిలిప్పీన్స్‌ వాసులతో టోక్యోలో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా తనలోని మగాడిని రోడ్రిగో బయటకు తీశారు.

చదవండి: అమెరికాలో దారుణం.. దుండగుడి కాల్పుల్లో 12 మంది మృతి…

సమావేశం సందర్భంగా తాను ముద్దుపెట్టుకునేందుకు వీలుగా ఐదుగురు మహిళా వలంటీర్లను వేదికకు దగ్గర కూర్చుబెట్టుకున్నారు. సమయం రాగానే తొలి మహిళపై అధరాలను చుంబించే ప్రయత్నం చేశారు.

ఆమె ఇబ్బంది పడుతూ పెదవులపై వద్దని సంజ్ఞ చేయడంతో చెంపలపై ముద్దుపెట్టుకుని పంపించారు. ఆ తర్వాత మిగతా నలుగురినీ అలాగే బలవంతంగా ముద్దాడారు.

అక్కడితో రోడ్రిగో ఆగలేదు. తాను నంపుంసకుడిని కాకుండా ఈ మహిళలు సాయం చేశారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తాను సాధారణంగా పెదవులపైనే ముద్దులు పెడతానంటూ సిగ్గులేకుండా చెప్పుకొచ్చారు. అధ్యక్షుడి చేష్టలతో అక్కడి వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయినా, ఇబ్బంది పడుతూనే చప్పట్లు కొట్టి ఊరుకున్నారు.

భార్య చూస్తుండగానే…

74 ఏళ్ల వృద్ధుడైన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో ఆ ఐదుగురు మహిళను తన భార్య ఎదుటే ముద్దుపెట్టుకోవడం విశేషం. రోడ్రిగో ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2018 జూన్‌లో సియోల్‌లోనూ ఆయన ఇదే పనిచేశారు. ఓ వివాహితను ముద్దాడారు. తనకు పెళ్లి అయిందని చెప్పినా వినిపించుకోకుండా ఆమె పెదవులను చుంబించారు. 

చదవండి: భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త! గ్రీన్ కార్డుల స్థానంలో ‘బిల్డ్ అమెరికా’ వీసాలు!
- Advertisement -