24.2 C
Hyderabad
Monday, October 12, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అంతమంది జవాన్లు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోరా!?: సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు…

అంతమంది జవాన్లు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోరా!?: సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు…

navjot-singh-sidhu
- Advertisement -

navjot-singh-sidhu

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ సిద్దూ విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెబుతూనే, ఎవరో పిరికిపందలు చేసిన పనికి, ఆ దేశం మొత్తాన్ని నిందించడం సరికాదనే తన వ్యాఖ్యలకు ఇప్పటికీ తాను కట్టుబడే ఉన్నానని చెప్పారు.

కర్తా‌ర్‌పూర్ కారిడార్ విషయంలో ఇరు దేశాలు ఇటీవలే ముందడుగు వేశాయని, ఉగ్రదాడి ప్రభావం దీనిపై పడరాదని అన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తాను ఆలింగనం చేసుకోవడంలో తప్పు లేదని సిద్దూ చెప్పారు. కార్గిల్ యుద్ధం సమయంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి కూడా పాకిస్తాన్‌లో పర్యటించారని గుర్తు చేశారు.

మన నాయకులు కొందరు డబుల్ గేమ్…

ఎలాంటి ఆహ్వానం లేకపోయినా మోడీ కూడా పాకిస్తాన్ వెళ్లారని సిద్ధూ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని సిద్దూ అన్నారు. అంతేకాదు, ఈ విషయంలో మన నాయకులు కొందరు డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇలాంటి కుట్రదారులను కూడా శిక్షించాల్సిందేనని అన్నారు.

ఓ రాజకీయ నేత ప్రయాణిస్తే సిటీ మొత్తాన్ని దిగ్బంధిస్తారని, వేల మంది జవాన్లు ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అని సిద్ధూ ప్రశ్నించారు. మరోవైపు, ఈ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సిద్దూను కపిల్ శర్మ షో నుంచి తొలగించారు. ఆయన స్థానంలో అర్చనా పూరణ్ సింగ్‌ను తీసుకున్నారు.

చదవండి : నీ పాకి‌స్తాన్ గొప్పతనం ఏంట్రా? సాలే! రష్మీ ఘాటు వ్యాఖ్యలు!

- Advertisement -