23.3 C
Hyderabad
Thursday, November 5, 2026
- Advertisement -
Home క్రైమ్ విషాదం: ముఖానికి కవర్, ఉరి వేసుకుని లేడీ టెక్కీ ఆత్మహత్య

విషాదం: ముఖానికి కవర్, ఉరి వేసుకుని లేడీ టెక్కీ ఆత్మహత్య

suicide
- Advertisement -

techie-suicide

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ లోని అరుణోదయ లేడిస్ హాస్టల్ ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీవిద్య(25) శనివారం ఆత్మహత్య చేసుకుంది. గదిలో లోపలి నుంచి గడియ పెట్టుకున్న శ్రీవిద్య ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఫ్యానుకు ఉరి వేసుకుంది.

ఉదయం తర్వాత కూడా గది తలుపు తీయకపోవడంతో హాస్టల్ సిబ్బంది కిటీకీ నుంచి చూడగా.. ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. దీంతో హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అరుణోదయ హాస్టల్‌లో శ్రీవిద్య ఫిబ్రవరి 10న చేరింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. బాధితురాలిది ఆత్మహత్య లేక హత్య అన్నది పోస్ట్ మార్టం తర్వాతే తేలుతుందని వ్యాఖ్యానించారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు హాస్టల్ సిబ్బంది తెలిపారని చెప్పారు.

చదవండి: ప్రియుడి మోజులో పడి భర్తను చంపేసింది: పిల్లల ముందే ఘోరం

- Advertisement -