టీడీపీకి షాక్! జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు పరిస్థితి అత్యంత విషమం!

YS Jagan Latest News, TDP Latest News, Srinivasarao News, Newsxpressonline
- Advertisement -

రాజమండ్రి : గత కొన్ని రోజుల ముందు వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్ర ముంగించుకొని వ్యక్తిగత పనులమీద హైదరాబాద్ కి వెళ్లాలని విశాఖ ఎయిర్ పోర్ట్ లో విఐపి లాంచ్ లో వెయిట్ చేస్తున్న సమయంలో , ఎయిర్ పోర్ట్ లోని ఒక రెస్టారెంట్ లో పనిచేసే శ్రీనివాసరావు అనే ఒక చెఫ్ కోడి కత్తితో దాడి చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలని కుదిపేసింది.

జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు ని అక్కడ ఉన్న వారు పట్టుకొని పోలీసులకి పట్టించారు. ఆ తరువాత ఎన్నో ఊహించని మలుపులతో ఈ కేసు క్లోజ్ అయ్యింది. ప్రస్తుతం జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు రాజమండ్రి లోని సెంట్రల్ జైలు లో శిక్షని అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడు.

ఈ నేపథ్యంలో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. నిన్న రాత్రి పది గంటల తర్వాత ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.

చదవండి: చంద్రబాబు పన్నిన కుట్ర నుండి జగన్ ఎలా బయటపడబోతున్నాడో చూడండి!

అతని ఆరోగ్య పరిస్థితి గురించి పోలీసులు కానీ, వైద్యం అందిస్తున్న డాక్టర్లు కానీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడం లేదు. ఈ సాయంత్రానికి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోతే అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఆసుపత్రి ఉంది. సాధారణ రోగాలకు అక్కడే వైద్యం అందిస్తుంటారు. సీరియస్ గా ఉన్న ఖైదీలను మాత్రమే జిల్లా ఆసుపత్రికి తరలిస్తారు.

ఎన్నికల నేపథ్యంలో శ్రీనివాసరావుకి అస్వస్థత ఏర్పడటం పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఏపీ లో జగన్ ప్రభావం చాల స్పష్టంగా కనిపించింది. ఎన్నికల ఫలితాలలో వైసీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తుంది.

ఇటువంటి నేపథ్యంలో జగన్ సీఎం అయితే, తనపై దాడి చేసిన శ్రీనివాసరావు చేత అసలు నిందుతల పేర్లు ఎక్కడ పెడతాడో అని ఎన్నికల ఫలితాలలోపే శ్రీనివాసరావు కథ ముగిసిపోయేలా చేసుకోవాలని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి శ్రీనివాసరావు పరిస్థితి ఏమౌతుందో..

చదవండి: నగరిలో రోజా గెలుపు పై భారీ బెట్టింగ్! నగరి ప్రజల తీర్పు ఎటువైపు!

- Advertisement -