26.4 C
Hyderabad
Sunday, September 20, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రాహుల్, ప్రియాంకలు కష్టపడ్డారు…ప్రతిపక్ష హోదాకి కావల్సిన సీట్లు వారికి వస్తాయి: శివసేన  

రాహుల్, ప్రియాంకలు కష్టపడ్డారు…ప్రతిపక్ష హోదాకి కావల్సిన సీట్లు వారికి వస్తాయి: శివసేన  

- Advertisement -

ముంబై: బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన పార్టీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…ఆయన సోదరి ప్రియాంక గాంధీలని ప్రశంసించింది. ఈ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలు చాలా కష్టపడ్డారని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో కథనంలో తెలిపింది.

అయితే వారికి గతంలో కంటే ఎక్కువ సీట్లు అంటే…లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందేందుకు అవసరమైన సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని తెలిపింది. అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పింది.

ఇటు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే మోడీ మరోసారి ప్రధాని అవుతారని చెప్పడానికి రాజకీయ పండితులు అవసరం లేదని శివసేన వ్యాఖ్యానించింది.

మోడీని మళ్లీ ప్రధానిని చేయాలనే నిర్ణయానికి ప్రజలు ఎప్పుడో వచ్చేశారని చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కంటే…కచ్చితమైన ఫలితాల కోసం 23వ తేదీ వరకు వేచి చూడటం మంచిదని వ్యాఖ్యానించింది.

చదవండి: 23 తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ చెల్లాచెదురవుతాయి: శివసేన
- Advertisement -