23.4 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home సినిమా టాలీవుడ్ సాహో సర్‌ప్రైజ్! రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్!

సాహో సర్‌ప్రైజ్! రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్!

- Advertisement -

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సాహో’. ఈ సినిమా కోసం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో సాహోపై ఆసక్తి పెరిగిపోయింది.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా అగ‌స్ట్ 15న ప్రపంచ‌ వ్యాప్తంగా ‘సాహో’ భారీ విడుదలకు సిద్ధమవుతోంది.

సినిమా విడుదలకు ఇంకా రెండు నెలలకు పైగా సమయం ఉంది. కానీ, సినిమా ప్రచార కార్యక్రమాలను ఇప్పటి నుంచే అధికారికంగా ప్రారంభించారు. ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓపెన్ చేసిన అకౌంట్ ద్వారా ‘సాహో’ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో చాలా సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లద్దాలు కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇదిగో డార్లింగ్స్, మీకోసం.. నా రాబోయే చిత్రం ‘సాహో’ సరికొత్త అధికారిక పోస్టర్. ఆగస్టు 15న థియేటర్స్‌లో కలుద్దాం!’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ప్రభాస్ పేర్కొన్నారు.

Prabhas Latest News, Saaho Movie Latest News, Tollywood Latest news, Newsxpressonline

- Advertisement -