22.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం రిలయన్స్ జియో నుంచి మరో సంచలనం.. ‘జూమ్’ యాప్‌‌కు పోటీగా ‘జియో మీట్’…

రిలయన్స్ జియో నుంచి మరో సంచలనం.. ‘జూమ్’ యాప్‌‌కు పోటీగా ‘జియో మీట్’…

- Advertisement -

న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లు గూగుల్ మీట్, జూమ్ యాప్‌లకు పోటీగా జియో నుంచి ‘జియో మీట్’ వచ్చేస్తోంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రస్తుతం చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు కల్పించాయి.

ఈ నేపథ్యంలో జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం 30 కోట్ల మంది యూజర్లతో జూమ్ యాప్ దూసుకెళ్తోంది.

గూగుల్ కూడా ఇటీవల సరికొత్త ఫీచర్లను జోడించి హ్యాంగ్ అవుట్ మీట్‌ను గూగుల్ మీట్‌గా నామకరణం చేసి విడుదల చేసింది. మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఉంది.

ప్రస్తుతం ఈ యాప్‌లకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని జియో కూడా ‘జియో మీట్’ పేరుతో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది.

ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, విండోస్‌, మ్యాక్‌ ఓఎస్‌ తదితర ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉంది. జియో మీట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌ను వినియోగించేందుకు ఈమెయిల్‌తో సైన్‌ అప్‌ అవసరం లేకుండా కేవలం ఫోన్‌ నంబర్‌తో లాగిన్ అయ్యే వెసులుబాటు ఉంది.

అలాగే, ఇతర యాప్‌ల మాదిరిగానే సమావేశాలను షెడ్యూల్ చేసుకోవచ్చు.

జియో మీట్ ఫ్రీప్లాన్‌లో ఐదుగురు వినియోగదారులు పాల్గొనే అవకాశం ఉండగా, బిజినెస్‌ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు పాల్గొనే వీలుంది.

ఈమెయిల్, ఓటీపీల ద్వారా సమావేశాల్లో పాల్గొనవచ్చు. అంతేకాదు, మీటింగ్ మధ్యలో కూడా కాన్ఫెరెన్సింగ్ లింక్ ద్వారా గెస్ట్‌లో మధ్యలో జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది.

- Advertisement -