రిలయన్స్ బిగ్ టీవీ బంపరాఫర్… రూ.2 వేలకే ఏడాదిపాటు అన్నీ ఫ్రీ!

- Advertisement -

ముంబై: డిష్ టీవీ సేవలు అందిస్తోన్న‘రియలన్స్ బిగ్ టీవీ’  బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ.2 వేలకే ఏడాదిపాటు పెయిడ్ చానల్స్, ఫ్రీ చానల్స్, హెచ్ డీ చానల్స్ అన్నీ ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది.  ఈ ఆఫర్‌లో భాగంగా తొలుత రూ.500 చెల్లించి కనెక్షన్ బుక్ చేసుకోవాలి.  సెట్ టాప్ బాక్స్ ఇన్ స్టలేషన్ సమయంలో మరో రూ.1,500 చెల్లించాల్సి ఉంటుంది.  వీటికి ఇన్ స్టలేషన్ చార్జీలు మరో రూ.250 అదనం.

మీకు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి రూ.500 చెల్లించడం ద్వారా రిలయన్స్ బిగ్ టీవీ కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం సంస్థ తపాలా శాఖతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సహా పలు రాష్ట్రాల పోస్టాఫీసుల్లో ఈ సదుపాయం జూన్ 20 నుంచి అందుబాటులో ఉంటుంది. లేదంటే రిలయన్స్ బిగ్ టీవీ వెబ్ సైట్ నుంచి కూడా రూ.500 చెల్లించి కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకున్న వినియోగదారులకు జూలై 30 నాటికల్లా వారింటి వద్ద సెట్ టాప్ బాక్స్‌లను ఇన్‌స్టాల్ చేస్తారు.

ఇలా తొలుత రూ.500 చెల్లించి రిలయన్స్ బిగ్ టీవీ కనెక్షన్‌ను బుక్ చేసుకున్న వారు సెట్ టాప్ బాక్స్ ఇన్ స్టలేషన్ సమయంలో మరో రూ.1,500,  ఇన్‌స్టలేషన్ చార్జీలు రూ.250  చెల్లిస్తే సరిపోతుంది.  దీంతో ఏడాది పాటు పెయిడ్ చానల్స్, ఫ్రీ చానల్స్, హెచ్ డీ చానల్స్ అన్నీ ఉచితంగా వీక్షించొచ్చు.  కాకపోతే ఏడాది దాటిన తర్వాత నుంచి ప్రతీ నెల రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటేనే పెయిడ్ చానల్స్ వీక్షించగలరు. అలా రెండేళ్ల పాటు ప్రతీ నెలా రూ.300 చొప్పున రీచార్జ్ చేసుకుంటే.. ఆ తర్వాత రూ.2,000ను లాయల్టీ బోనస్ కింద కంపెనీ వెనక్కి ఇచ్చేస్తుంది.  ఇదేదో బాగానే ఉందంటారా? మరి ఆలస్యమెందుకు బుక్ చేసేసుకోండి!

- Advertisement -