సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధానితో రాజ్‌నాథ్, రావత్ భేటి.. అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు సందేశం

- Advertisement -

న్యూఢిల్లీ: సరిహద్దు ఘర్షణ కారణంగా చైనా, భారత్‌ల మధ్య తీవ్ర ఉధ్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందె. అయితే ఇటీవల పెట్రోలింగ్‌కు వెళ్ళిన భారతీయ సైనికులపై గాల్వన్ లోయలో చైనా సైనికులు దాడి చేశారు.

ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. బుధవారం ప్రధాని మోడీ దీనిపై పమావేశం నిర్వహించారు.

కాసేపటి క్రితమే మోడీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్‌ల సమావేశం ముగిసింది. అప్రమత్తంగా ఉండాలంటూ త్రివిధ దళాలకు సందేశాలు వెళ్లాయి.

సైనికుల ప్రాణ త్యాగాలను వృథా కానీయమంటూ ప్రధానమంత్రి ప్రకటించిన నేపథ్యంలోనే అలర్ట్‌గా ఉండాలంటూ త్రివిధ దళాలకు సందేశాలు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక డ్రాగన్ కంట్రీ విషయంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు భారత్-చైనా మేజర్ జనరల్‌ల మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. మూడు గంటల పాటు చర్చలు జరిగాయి.

అయితే ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. ఈ నేపథ్యంలో మరో దఫా గురువారం కూడా చర్చలు జరపాలని ఇరువైపుల అధికారులు నిర్ణయించారు.

అయితే లఢక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సమయంలో తలెత్తిన ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోయారని వస్తున్న వార్తలను మాత్రం డ్రాగన్ కంట్రీ ఇప్పటివరకు ధృవీకరించలేదు.

చదవండి: గాల్వన్ లోయ ఘటన: అమరులైన భారత జవాన్లు వీరే, పేర్లు విడుదల చేసిన సైన్యం…
చదవండి: చైనాతో ఘర్షణలో.. 23 మంది భారత సైనికుల వీరమరణం?
 
- Advertisement -