19.7 C
Hyderabad
Monday, November 9, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం మోడీ ఒక దొంగ.. రూ.30 వేల కోట్లు దొంగిలించారు?: రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

మోడీ ఒక దొంగ.. రూ.30 వేల కోట్లు దొంగిలించారు?: రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

rahul hot comments on modi
- Advertisement -

ఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

సుప్రీంకోర్టునే మోసం చేశాడు..

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన బేరసారాల చర్చల్లో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకోవడాన్ని రక్షణ శాఖ తీవ్రంగా నిరసించిందంటూ ‘ది హిందూ’ పత్రిక శుక్రవారం నాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

చదవండి : ఆ పార్టీలో గడ్కరీ ఒక్కడే దమ్మున్నోడు: రాహుల్ సెటైర్లు

ఈ సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ రఫేల్ ఒప్పందంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.30 వేల కోట్లు దొంగిలించారని, ఆ మొత్తాన్ని తన స్నేహితుడు అనిల్ అంబానీకి ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పాడు.

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో రక్షణ శాఖకు సమాంతరంగా ప్రధానమంత్రే స్వయంగా బేరసారాలు చేశారని తేటతెల్లమైందని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నాకు నిజానికి పరుషమైన మాటలు అనడం ఇష్టం ఉండదు. కానీ, నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పడం లేదు. ప్రధానమంత్రి ఒక ‘దొంగ’ అని చెప్పడం ఇప్పుడు నా బాధ్యత అని రాహుల్ అన్నారు.

 

- Advertisement -