

హైదరాబాద్: జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పార్టీని బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా ఆర్థికంగా, ప్రజాదారణ పరంగా బలమైన నేతలను కాకుండా మేధావులకు జనసేనాని స్థానం కల్పిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది మేధావులు జనసేనలో చేరారు. వారిలో కొంత మందిని ముఖ్యమైన పదవుల్లో పవన్ కూర్చోబెట్టారు.
ఫిదా అవుతున్న పవన్ ఫాన్స్..
బీవీ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు, ఏపీజే అబ్దుల్ కలాం సైంటిఫిక్ సలహాదారు పోన్‌రాజ్, రిటైర్డ్ డీఐజీ రవికుమార్ మూర్తి.. ఇలా చాలామందిని పార్టీలోకి పవన్ ఆహ్వానించారు. ప్రజా సేవచేయడానికి విద్యావంతుల సహాయం తీసుకుంటేనే దానికొక విలువ, అర్థం ఉంటుంది.
పవన్ కళ్యాణ్ సార్ ఇలాంటి చొరవ తీసుకుని వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది అని మనోజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మనోజ్ పవన్ కళ్యాణ్ పై చేసిన ట్విట్ చూసిన పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Having well educated professionals to help serve the public just adds a great value and meaning..👍👍 Super happy to see @PawanKalyan sir take the initiative in trusting and giving respect to the worthy in @JanaSenaParty #APEletctions2019 #EducatedPeople pic.twitter.com/j2R9E15Opc
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 8, 2019








