#MeToo ఉద్యమానికి భారత నిర్మాతల సమాఖ్య మద్దతు…

producers guild
- Advertisement -

producers guild

ముంబై : దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న #MeToo ఉద్యమానికి భారత నిర్మాతల సమాఖ్య (ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా) బుధవారం మద్దతు పలికింది. బాలీవుడ్‌ దిగ్గజాలు నానా పటేకర్‌, సుభాష్‌ ఘాయ్‌, సాజిద్‌ ఖాన్‌,  రజత్‌ కపూర్‌, వికాస్‌ బహల్‌ సహా పలువురు ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడం పెను సంచలనాన్ని స‌ృష్టించింది.

‘మీటూ’ పేరుతో అన్ని రంగాలకు చెందిన మహిళలు తాము అనుభవించిన లైంగిక వేధింపులను బాహాటంగా వెల్లడిస్తున్న క్రమంలో ఈ ఉద్యమానికి మద్దతుగా ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా కూడా మద్ధతు పలుకుతూ ఓ అధికారిక ప్రకటన కూడా జారీ చేసింది.

పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురైతే తగిన చట్టాలను అమలు చేస్తామని సభ్యులంతా తప్పనిసరిగా డిక్లరేషన్‌పై సంతకం చేయాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. ఈ డిక్లరేషన్‌ సమర్పించని సభ్యుడిని 30 రోజుల తరువాత సమాఖ్య నుంచి బహిష్కరిస్తామని కూడా హెచ్చరించింది.

అంతేకాదు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైన వారిపై కఠిన చర్యలు చేపడతామని కూడా ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా హామీ ఇచ్చింది. అలాగే పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం.. నైపుణ్యం కలిగిన ఇతర ఏజెన్సీలతో కలిసి వర్క్‌షాపులు నిర్వహిస్తామనీ పేర్కొంది.

- Advertisement -