25.2 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ‘థాంక్యూ బేటా..’: ప్రసంగం మధ్యలో.. చిన్నారికి థాంక్స్ చెప్పిన మోడీ, ఏం జరిగిందంటే…

‘థాంక్యూ బేటా..’: ప్రసంగం మధ్యలో.. చిన్నారికి థాంక్స్ చెప్పిన మోడీ, ఏం జరిగిందంటే…

- Advertisement -

వారణాసి: ప్రధాని నరేంద్ర మోడీ ఓ చిన్నారి విన్నపాన్ని ఆలకించారు. అంతేకాదు, ఆ చిన్నారి అందించిన చీటీని చదివి, థాంక్స్ కూడా చెప్పారు.

శుక్రవారం వారణాసిలో ప్రధాని మోడీ తన నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందుగా స్థానిక బీజేపీ నాయకులు కషి ప్రాంతంలో ఓ రోడ్ షో నిర్వహించగా, ప్రధాని అభిమానులు, ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ చిన్నారి తన చేతిలో చిన్న చీటి పట్టుకుని మోడీకి సంజ్ఞ చేసింది. అది గ్రహించిన ఆయన ఆ చిన్నారి చేతిలో ఉన్న చీటీని తీసుకోవాల్సిందిగా తనకు సమీపంలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) కమాండోలకు చెప్పారు.

వారు ఆ చిన్నారి చేతిలోని కాగితాన్ని మోడీకి అందివ్వగా ఆయన చదివడమేకాక ‘థాంక్యూ బేటా..’ అంటూ ఆ చిన్నారికి థాంక్స్ చెప్పి, ఆనక తన ప్రసంగాన్ని కొనసాగించారు.

‘‘నా విజయం ఒక్కటే కాదు..’’

తన విజయం ఒక్కటే ముఖ్యం కాదని, దేశంలోని ప్రజాస్వామ్యం విజయం సాధించాలన్నదానిపైనే తనకు ఆసక్తి ఎక్కువని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. శుక్రవారం వారణాసిలో ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని, ఈ ఎన్నికల్లో తమ తరుపున ప్రజలే పోరాడుతున్నారని అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తరువాత అధికార బీజేపీకి అనుకూల పవనాలు విస్తున్నాయనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంగీకరించాలన్నారు. తాను నెలన్నర రోజులుగా దేశంలోని పలు ప్రాంతాలు తిరిగానని, అందరూ బీజేపీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

మోడీ, షా, యోగి.. అందరూ బీజేపీ కార్యకర్తలేనని ప్రధాని వ్యాఖక్యానించారు. వారణాసిలో ఘన విజయం సాధించడం, అలాగే పోటీచేసిన అన్ని చోట్లా కాషాయ జెండాను ఎగరవేయడం.. ఇవే మన ముందున్న రెండు ప్రధాన అంశాలు అంటూ కార్యకర్తలను మోడీ ఉత్సాహపరిచారు.

ఈసారి తాను రికార్డు విజయం సాధించాలని ప్రతి బీజేపీ కార్యకర్త కోరుకుంటున్నారని, తనకు గంగమ్మ దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని ప్రధాని అంటూ.. ప్రతి బూత్‌ కార్యకర్త శ్రమించాలని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి కాషాయ జెండా మరింత ఎత్తున ఎగిరేలా చేయాలని పిలుపునిచ్చారు.

‘‘మళ్లీ ఒక్కసారి’’ అని మోడీ అనగానే… ‘‘మోడీ సర్కార్’’ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద పెట్టున నినదించారు. గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు కావడం మాత్రమే చూశామనీ.. కానీ గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వం పనిచేయడం చూస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు.
‘‘నేను ప్రధానమంత్రిని అని ఎప్పుడూ చెప్పుకోలేదు. ఒక్క కార్యకర్తను కూడా కలుసుకోకుండా ఉండలేదు. నాలోని కార్యకర్తను కూడా చావనివ్వలేదు. ప్రధానిగానూ, ఎంపీగానూ నా విధులు ఎలా నిర్వహించాలో నాకు తెలుసు…’’ అని మోడీ పేర్కొన్నారు.

varanasi-pm-modi-nominationనామినేషన్ వేసిన మోడీ…

ప్రధాని మోడీ శుక్రవారం వారణాసి లోక్‌సభ స్థానానికి తన నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ్నించే ఆయన పోటీచేసి గెలిచారు. ఇప్పుడు కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం బీజేపీ చీఫ్ అమిత్‌ షా, బీహార్ సీఎం నితీశ్ కుమార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సహా ఎన్డీయే నేతలు, కేంద్రమంత్రులు వెంటరాగా… ప్రధాని మోడీ వారణాసిలోని కలెక్టరేట్‌కు వెళ్లి తన నామినేషన్ సమర్పించారు.

- Advertisement -