23.8 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం ఫోన్ పే వినియోగదారులకు తీపి కబురు

ఫోన్ పే వినియోగదారులకు తీపి కబురు

- Advertisement -

ముంబై: ఫోన్ పే వినియోగదారులకు ఇది శుభవార్త. ప్రైవేటు రంగ యస్ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించిన ఫోన్ పే వినియోగదారులు ఇబ్బందుల్లో పడ్డారు.

ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న ఫోన్‌ పే సేవలపైనా ఆంక్షల ప్రభావం పడింది. దీంతో గత రెండు రోజులుగా ఈ సంస్థల నుంచి సేవలు నిలిచిపోయాయి.

వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఫోన్ పే సేవల పునరుద్ధరణకు ప్రయత్నాలు ప్రారంభించింది.

యస్ బ్యాంకు స్థానంలో మరో ప్రైవేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐతో జట్టు కట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య కార్య నిర్వహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు.

అత్యవసర సమయంలో తమతో కలిసి ఆదుకున్నందుకు ఈ సందర్భంగా ఐసీఐసీఐతోపాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -