21.7 C
Hyderabad
Friday, November 6, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం కాంగ్రెస్ సీనియర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూత.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ సీనియర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూత.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు

- Advertisement -

న్యూఢిల్లీ: న్యాయశాఖ మాజీ మంత్రి, మాజీ గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ (83) నిన్న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు.

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గత బుధవారం సాకేత్‌లో మాక్స్ ఆసుపత్రిలో చేరారు.

నేటి సాయంత్రం నాలుగు గంటలకు నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు జరగుతాయని ఆయన కుమారుడు అరుణ్ భరద్వాజ్ తెలిపారు.

హన్స్‌రాజ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హన్స్‌రాజ్ మరణవార్తతో కాంగ్రెస్ శ్రేణులు విషాదం మునిగిపోయాయి.

- Advertisement -