26.2 C
Hyderabad
Friday, November 27, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం అభినందన్‌‌ను భారత హైకమిషన్‌కు అప్పగించిన పాక్, ఈ మధ్యాహ్నానికల్లా భారత్ గడ్డపైకి…

అభినందన్‌‌ను భారత హైకమిషన్‌కు అప్పగించిన పాక్, ఈ మధ్యాహ్నానికల్లా భారత్ గడ్డపైకి…

abhinandan varthaman
- Advertisement -

abhinandan varthaman

ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్ వర్థమాన్‌ను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహ్ముద్ ఖురేషి ప్రకటించారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను భారత్‌కు అప్పగించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే అభినందన్‌ తల్లిదండ్రులు ఢిల్లీకి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున మువ్వన్నెల జెండాలతో ఎదురుచూస్తున్నారు.

భారత్ హైకమిషన్‌కు చేరిన అభినందన్….

దేశం యావత్తూ పాకిస్తాన్ ఆర్మీ చేతికి చిక్కన భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ రాక కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే పాక్ అధికారులు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు ఆయన్ని అప్పగించిన్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3-4 గంటల మధ్య ఆయన అట్టారీ-వాఘా జాయింట్ చెక్‌పోస్టు మీదుగా స్వదేశంలోకి అడుగుపెట్టనున్నారు.

బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని భారత సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్‌‌కి చెందిన మిగ్21 యుద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ అభినందన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అధికారులు అదేరోజు తమ అదుపులోకి తీసుకున్నారు.

జనీవా ఒప్పందం ప్రకారం ఆయనను వెంటనే బేషరతుగా స్వదేశానికి తిప్పి పంపాలంటూ భారత్ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఇరుదేశాల మధ్య శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ గురువారమే ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ అధికారులు పైలట్ అభినందన్‌ను శుక్రవారం ఆయన్ని పాకిస్తాన్‌లోని భారత హైకమిషన్ అధికారులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అభినందన్ విడుదలపై పాక్ కొత్త నాటకం! ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటూ మెలిక…
పాక్‌ భూభాగంలో అభినందన్ పడిపోయాక.. ఏం జరిగిందో తెలుసా?: పాక్ పత్రిక సంచలన కథనం!
భారత పైలట్‌‌పై పాక్ అమానుషం! అభినందన్ స్వస్థలం కేరళ!

- Advertisement -