
- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు వరాలు కురిపించారు. రైళ్ల ద్వారా పంటల రవాణాకు కిసాన్ రైల్ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు.
కిసాన్ క్రెడిట్ స్కీం కోసం రూ. 15లక్షల కోట్లు కేటాయింపులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 2021 నాటికి 108 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తే లక్ష్యమన్నారు.
మత్స్య ఉత్పత్తి రంగంలో గ్రామీణ యువతకు ప్రోత్సాహకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
6.11 కోట్ల మంది రైతులను ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కిందకు తీసుకొచ్చామన్నారు. మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతికి సహకరిస్తున్నామని నిర్మల వివరించారు.
- Advertisement -








