27.6 C
Hyderabad
Wednesday, November 4, 2026
- Advertisement -
Home వార్తలు జాతీయం విలాసవంతమైన నీరవ్ మోడీ బంగ్లాను డైనమెట్లతో పేల్చి కూల్చారు!

విలాసవంతమైన నీరవ్ మోడీ బంగ్లాను డైనమెట్లతో పేల్చి కూల్చారు!

- Advertisement -

ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో రూ. 13వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ నివాస భవనాన్ని శుక్రవారం అధికారులు కూల్చివేశారు. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో విలాసవంతమైన బంగ్లాను రాయగడ్ జిల్లా కలెక్టర్ విజయ సూర్యవంశి, ఇతర అధికారుల సమక్షంలో బాంబులతో పేల్చివేసి పూర్తిగా నేలమట్టం చేశారు.

బిల్డింగ్ కూల్చడం బుల్‌డోజర్ల వల్ల కాకపోవడంతో.. ప్రత్యేక బృందాన్ని పిలిపించి మరీ బంగ్లాను కూల్చేశారు. శక్తివంతమైన దాదాపు 100 డైనమెట్లు వినియోగించి బంగ్లాను ధ్వంసం చేశారు.

రూ.100 కోట్ల విలాసవంతమైన భవనం…

33వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బంగ్లాను నాణ్యమైన సిమెంట్‌తో నిర్మించడంతో బుల్డోజర్లతో కూల్చడం అసాధ్యమని భావించిన అధికారులు.. డైనమెట్లను ఉపయోగించి బంగ్లాను నేలమట్టం చేశారు.

కాగా, ఈ భవనం విలువ రూ. 100కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగ్లా అక్రమ నిర్మాణం కావడంతోనే కూల్చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇది ఇలావుంటే, ఈ బంగ్లాను ఈడీ దర్యాప్తులో భాగంగా అటాచ్ చేసింది.

చదవండి: పీఎన్‌బీ స్కాం: భారత పౌరసత్వాన్ని వదులుకున్న మెహుల్ ఛోక్సీ, ఇక అక్కడే..
- Advertisement -